వినియోగదారులపై చమురు ధరల వాత కొనసాగుతోంది. వరుసగా ఎనిమిదో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి చమురు సంస్థలు. లీటరు పెట్రోల్ ధర ఆదివారం (దిల్లీలో) 62 పైసలు పెరిగి రూ. 75.78కి చేరింది. లీటర్ డీజిల్‌పై 64 పైసలు పెరిగి రూ. 74.03కు చేరింది.
గడిచిన ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర (లీటర్‌పై) రూ.4.5, డీజిల్ ధర (లీటర్‌పై) రూ.4.6 పెరిగింది.