2020 డిసెంబర్లో ప్రయాణికుల వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య(ఫాడా) నివేదిక తెలిపింది. 2020 డిసెంబర్లో 2,71,249 యూనిట్లు అమ్ముడయ్యాయని వెల్లడించింది. 2019 డిసెంబర్‌తో పోల్చితే ఇది 24శాతం అధికమని వివరించింది.
ద్విచక్ర వాహన విక్రయాలు 2020 డిసెంబర్లో 11.88 శాతం పెరిగి 14,24,620గా నమోదయ్యాయి.
వాణిజ్య వాహన అమ్మకాలు 13.52శాతం క్షీణించాయి. గత సంవత్సరం 59,497అమ్ముడవ్వగా 2020 డిసెంబర్లో 51,454 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి.
మూడు చక్రాల వాహన విక్రయాలు సైతం భారీగా(52.75శాతం) పడిపోయాయి. 58,651నుంచి 27,715 కు తగ్గాయి. ఇక ట్రాక్టర్ల అమ్మకాలు 35.49శాతం పెరిగాయి. అన్ని కేటగిరీలు కలిపి మొత్తంగా వాహన విక్రయాలు 11.01 శాతం పెరిగాయి.
దేశవ్యాప్తంగా ఉన్న రవాణా కార్యాలయాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఫాడా ఈ గణాంకాలను విడుదల చేసింది.
ఇదీ చదవండి: ఐటీ, ఆటో దూకుడు- మార్కెట్ల నయా రికార్డు