ETV Bharat / business

టెలికాం, క్యాబ్ ఆపరేటర్లకు పార్లమెంటరీ కమిటీ నోటీసులు - డేటా ప్రొటెక్షన్ బిల్ పార్లమెంటరీ కమిటీ

టెలికాం ఆపరేటర్లు ఎయిర్​టెల్, జియో సహా క్యాబ్ ఆపరేటర్లు ఓలా, ఉబర్ సంస్థలకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ నోటీసులు జారీ చేసింది. సమాచార భద్రత విషయంపై విచారణకు తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. 'వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు'ను కమిటీ పరిశీలిస్తోంది.

parliamentary
టెలికాం, క్యాబ్ ఆపరేటర్లకు పార్లమెంటరీ కమిటీ నోటీసులు
author img

By

Published : Oct 29, 2020, 9:11 AM IST

సమాచార భద్రత అంశంపై టెలికాం, క్యాబ్ ఆపరేటర్లకు పార్లమెంట్ సంయుక్త కమిటీ నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరు కావాలని రిలయన్స్ జియో, ఎయిర్​టెల్, ఓలా, ఉబర్ ప్రతినిధులను ఆదేశించింది. భాజపా ఎంపీ మీనాక్షీ లేఖీ అధ్యక్షతలోని ఈ కమిటీ.. 'వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు 2019'పై సమీక్షిస్తోంది.

నోటీసులోని వివరాల ప్రకారం.. రిలయన్స్ జియో ఇన్ఫోకాం, జియో ప్లాట్​ఫాం ప్రతినిధులను నవంబర్ 4న జరిగే విచారణకు వేర్వేరుగా హాజరుకావాలని ప్యానెల్ ఆదేశించింది. ఓలా, ఉబర్ ప్రతినిధులను తర్వాతి రోజు హాజరుకావాల్సిందిగా సూచించింది. అదేవిధంగా ఎయిర్​టెల్, ట్రూకాలర్ సంస్థల ప్రతినిధులు నవంబర్ 6న హాజరవ్వాలని స్పష్టం చేసింది.

ఇప్పటికే ఫేస్​బుక్, ట్విట్టర్​, అమెజాన్ ప్రతినిధులు ప్యానెల్ ముందు హాజరయ్యారు. అక్టోబర్ 29న గూగుల్, పేటీఎం సభ్యులు రానున్నారు.

వ్యక్తిగత సమాచార భద్రత బిల్లును 2019 డిసెంబర్ 11న కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ లోక్​సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఉభయసభల సంయుక్త కమిటీ పరిశీలనకు పంపించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.