ETV Bharat / business

'వివాద్ సే విశ్వాస్' బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

author img

By

Published : Mar 13, 2020, 5:34 PM IST

పన్ను చెల్లింపుదారుల వివాదాల నుంచి ఊరట కల్పించే వివాద్​ సే విశ్వాస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. లోక్​సభలో ఇదివరకే ఆమోదముద్ర పడిన ఈ బిల్లును పెద్దల సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

vivad se vishwas
వివాద్ సే విశ్వాస్

పన్ను చెల్లింపుదారుల వివాదాలను పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించే వివాద్​ సే విశ్వాస్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. మార్చి 4న లోక్​సభలో పాసైన ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో రాజ్యసభ నేడు ఆమోద ముద్ర వేసింది.

బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాలు పలు విషయాలు లేవనెత్తాయి. బిల్లు పార్లమెంట్​ ఆమోదం పొందక ముందే కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం దీనిపై సర్కులర్ జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే వాటిని తోసిపుచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేశారు. ఈ పథకానికి సంబంధించిన గడువు తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. బిల్లుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అన్ని రాష్ట్రాలకు పంపిస్తామని చెప్పారు.

బిల్లు ఉద్దేశం..

పన్ను చెల్లింపుదారులు ఎలాంటి వడ్డీ, జరిమానా లేకుండా కేవలం బకాయి పడ్డ పన్నులు మార్చి 31లోపు చెల్లించే అవకాశం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది.

కేవలం జరిమానా, వడ్డీకి సంబంధించిన వివాదాలకు సైతం ఈ బిల్లు పలు వెసులుబాటులు కల్పించనుంది. వివాదాస్పద పన్ను మొత్తాన్ని మార్చి 31 లోపు కడితే వడ్డీ, జరిమానాకు సంబంధించిన బకాయిల్లో 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 31 లోపు చెల్లించకుంటే 30 శాతం చెల్లించాల్సి వస్తుంది. ఈ పథకం 2020 జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది.

గణాంకాల ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టులు సహా వివిధ ఫోరంల వద్ద రూ.9.32 లక్షలు విలువ చేసే... 4.83 లక్షల ప్రత్యక్ష పన్నుల కేసులు పెండింగ్​లో ఉన్నాయి.

ఇదీ చదవండి: 2 నెలల్లో సెన్సెక్స్​ 7,850 పాయింట్లు కోల్పోయిందిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.