ETV Bharat / business

ఆ పాన్‌కార్డు వాడితే 10వేలు జరిమానా..!

ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌కార్డులను వినియోగిస్తే రూ.10 వేల జరిమానా విధించే అవకాశం ఉందని ఆదాయపుపన్ను శాఖ తాజాగా ప్రకటించింది. మార్చి 31నాటికి ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌కార్డులను పనిచేయని వాటిగా పరిగణిస్తామని ఇదివరకే ఆదాయపుపన్ను శాఖ వెల్లడించింది.

aadhar pan link
ఆధార్​ పాన్​
author img

By

Published : Mar 3, 2020, 2:05 PM IST

గడువు తేదీలోపు పాన్‌కార్డుకు ఆధార్‌ అనుసంధానించని వినియోగదారులపై ఐటీ చట్టం ప్రకారం న్యాయపరమైన చర్యలు తప్పవని తెలిపింది ఆదాయపుపన్ను శాఖ. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 272B ప్రకారం రద్దయిన పాన్‌ కార్డు వాడినవారికి రూ.10వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

అనుసంధానం తప్పనిసరి..

ఆదాయపుపన్ను చట్టంలోని సెక్షన్‌139 ప్రకారం, 2017 జులై 1 ముందు కార్డు పొందిన వ్యక్తి కచ్చితంగా తన ఆధార్‌ నెంబరును ఐటీశాఖ అధికారికి తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే 2020 మార్చి 31ను గడువు తేదీ విధించిన ఐటీశాఖ.. ఏప్రిల్‌ 1 నుంచి అలాంటి పాన్‌కార్డును పనిచేయనిదిగా పరిగణిస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ప్రకటించింది.

పాన్‌కార్డును పనిచేయనిదిగా పరిగణిస్తే మాత్రం ఆర్థిక, బ్యాంకింగ్​, ఆస్తుల కొనుగోలు-అమ్మకాలు, స్టాక్‌ మార్కెట్ల లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీని గడువును పలుమార్లు పొడగించిన ఐటీశాఖ.. ఈసారి మాత్రం గడువుతేదీ పొడగించే అవకాశం లేదని తెలుస్తోంది.

అయితే, గడువుతేదీ ముగిసిన అనంతరం కూడా పాన్‌కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసే వీలుంది. ఆధార్‌ లింక్‌ చేసినప్పటినుంచి తిరిగి అదే పాన్‌కార్డును పనిచేసేదిగా పరిగణిస్తారు.

ఆధార్‌-పాన్‌కార్డు అనుసంధానం ఇలా..

  • ఆదాయపుపన్ను శాఖ ‘ఈఫైలింగ్‌’ పోర్టల్‌ సాయంతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌లో ఎడమవైపున ఉన్న "లింక్​ ఆధార్"​ విభాగంపై క్లిక్‌ చేసి ఆధార్‌, పాన్‌ వివరాలు తెలపవచ్చు.
  • అనుసంధానం కోసం ఎస్‌ఎంఎస్‌ సౌకర్యం కూడా కల్పించింది. ఇందుకోసం 567678 లేదా 56161కు "UIDPAN <స్పేస్‌> 12 అంకెల ఆధార్ సంఖ్య <స్పేస్‌> 10 అంకెల పాన్​ సంఖ్య" టైపు చేసి మెసేజ్‌ చేయాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.