ETV Bharat / business

'సెప్టెంబర్​లో వాహన విక్రయాలు 10.24% డీలా'

author img

By

Published : Oct 9, 2020, 5:29 PM IST

సెప్టెంబర్​లోనూ వాహనాల విక్రయాలు భారీగా తగ్గాయి. అన్ని విభాగాల్లో కలిపి గత నెల 13,44,866 వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయని.. వాహన డీలర్ల సామాఖ్య ఫాడా వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే.. ఈ విక్రయాలు 10.24 శాతం తక్కువని తెలిపింది. ప్యాసింజర్ వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం సెప్టెంబర్​లో సానుకూల వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది.

Vehicle sales down in September
సెప్టెంబర్​లోనూ వాహన విక్రయాలు డీలా

ప్యాసింజర్ వాహనాల విక్రయాలు సెప్టెంబర్​లో మోస్తరుగా పెరిగాయి. గత ఏడాది సెప్టెంబర్​తో పోలిస్తే.. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 9.81 శాతం పుంజుకున్నట్లు వాహన డీలర్ల సమాఖ్య 'ఫాడా' ప్రకటించింది. గత నెల మొత్తం 1,95,665 యూనిట్లు విక్రయమైనట్లు వెల్లడించింది. 2019 సెప్టెంబర్​లో ప్యాసింజర్ వాహనాల విక్రయాల సంఖ్య 1,78,189గా ఉన్నట్లు వివరించింది.

'ఫాడా' ప్రకారం సెప్టెంబర్​లో వాహన విక్రయాలు ఇలా..

  • ద్విచక్రవాహనాల విక్రయాలు గత నెల 12.62 శాతం తగ్గి.. 10,16,977 యూనిట్లుగా నమోదయ్యాయి. 2019 సెప్టెంబర్​లో 11,63,918 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి.
  • వాణిజ్య వాహనాల విక్రయాలు సెప్టెంబర్​లో భారీగా 33.65 పడిపోయాయి. గత నెల 39,600 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019 సెప్టెంబర్​లో 59,683 వాణిజ్య వాహనాలు విక్రయమవ్వడం గమనార్హం.
  • ఈ ఏడాది సెప్టెంబర్​లో 24,060 త్రిచక్ర వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది సెప్టెబర్​లో విక్రయమైన 58,485 యూనిట్లతో పోలిస్తే.. ఇవి 58.86 శాతం తక్కువ.
  • ట్రాక్టర్ల విక్రయాలు సెప్టెంబర్​లో భారీగా 80.59 శాతం పెరిగాయి. మొత్తం 68,564 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ట్రాక్టర్ల విక్రయాలు 38,008 యూనిట్లుగా ఉన్నాయి.
  • అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబర్​లో 10.24 శాతం తగ్గాయి. మొత్తం 13,44,866 యూనిట్లు విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో విక్రయమైన వాహనాల సంఖ్య 14,98,283గా ఉంది.

ఇదీ చూడండి:బంగారం, వెండి కాస్త ప్రియం- ప్రస్తుత ధరలు ఇవే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.