ETV Bharat / business

వ్యాక్సిన్ వార్తలు, ప్యాకేజీ ఆశలే మార్కెట్లకు కీలకం! - నిఫ్టీ

స్టాక్ మార్కెట్లకు ఈ వారం కరోనా వ్యాక్సిన్ వార్తలు, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆశలు కీలకంగా మారనున్నాయి. వీటితో పాటు దేశీయంగా ఈ వారం విడుదల కానున్న ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలపై మదుపరులు దృష్టి సారించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Stock market outlook for this Week
అమెరికా ఉద్దీపనపై మార్కెట్ల ఆశలు
author img

By

Published : Dec 6, 2020, 11:28 AM IST

Updated : Dec 6, 2020, 12:43 PM IST

కొవిడ్ వ్యాక్సిన్​ సంబంధిత వార్తలు, అమెరికాలో తాజా ఉద్దీపన ప్యాకేజీపై ఆశలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ ప్రభావం, ఇతర భౌగోళిక, రాజకీయ పరిణామాలు మార్కెట్లకు కీలకంగా మారనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

కరోనా వ్యాక్సిన్​ త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వెలువడిన వార్తలు, అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆశలతో గత వారం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన స్టాక్​ మార్కెట్లు భారీగా లాభాలను నమోదు చేశాయి. ఈ వారం కూడా ఆ సానుకూలతలు కొనసాగే అవకాశముందంటున్నారు నిపుణులు.

దేశీయంగా.. శుక్రవారం మార్కెట్లు ముగిసిన తర్వాత పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్నాయి. వీటికి సంబంధించిన అంచనాలపైనా మదుపరులు దృష్టి సారించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు మార్కెట్​ బ్రోకర్లు.

వీటన్నింటితో పాటు రూపాయి విలువ, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులూ మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చూడండి:వాహనదారులకు పెట్రో మోత- మళ్లీ పెరిగిన ధరలు

Last Updated : Dec 6, 2020, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.