ETV Bharat / business

దేశంలో మళ్లీ ఉల్లి కష్టాలు... కిలో రూ.80..!

దేశంలో పెట్రోల్​ ధరలతో పోటీగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సరఫరా తగ్గి చాలా ప్రాంతాల్లో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. దిల్లీలో గత వారం రూ.50-60 మధ్య ఉన్న కిలో ఉల్లి ధర.. ఈ వారాంతానికి రూ.70-80కి చేరింది.

ఉల్లి ధరల ఘాటు
author img

By

Published : Sep 22, 2019, 3:12 PM IST

Updated : Oct 1, 2019, 2:08 PM IST

దేశంలో ఉల్లి ధరల ఘాటు రోజు రోజుకు పెరుగుతోంది. దేశ రాజధాని దిల్లీ సహా పలు ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.70-80కి చేరి సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. ఉల్లి అధికంగా పండించే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా సరఫరా నిలిచి.. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం..

రిటైల్ మార్కెట్లో..​ ఉల్లి ధర గతవారం కిలోకు రూ.57(దిల్లీ), రూ.56 (ముంబయి), రూ.48 (కోల్​కతా), రూ.34 (చెన్నై) వరకు ఉంది. ఇదే సమయంలో గురుగ్రామ్​, జమ్ములో అత్యధికంగా రూ.60కి చేరింది. అయితే ఈ వారాంతంలో రూ.70-80 వరకు చేరినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఉల్లి ధరల నియంత్రణపై దృష్టి సారించింది కేంద్రం. మరో రెండు మూడు రోజుల్లో పరిస్థితి అదుపులోకి రాకపోతే.. వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై పరిమితులు విధించాలని భావిస్తోంది.

ప్రస్తుతం మార్కెట్లో నిల్వ చేసుకున్న ఉల్లిని విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఖరీఫ్​ సీజన్​లో పండిన తాజా ఉల్లి నవంబర్​ నుంచి మార్కెట్లోకి వస్తే... పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావచ్చని అంటున్నారు.

ఇదీ చూడండి: పెట్రో​ సెగ: 6 రోజుల్లో ధర ఎంత పెరిగిందో తెలుసా?

Texas (USA), Sep 22 (ANI): While addressing the media on human rights violations by Pakistan, Sindhi activist Zafar said, "Sindhi people have come here in Houston with a message. When Prime Minister Narendra Modi passes through here in morning we will be here with our message that we want freedom. We hope PM Modi and President Donald Trump will help us."
Last Updated : Oct 1, 2019, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.