ETV Bharat / business

ఏడాది గరిష్ఠానికి ముడి చమురు ధరలు

author img

By

Published : Mar 8, 2021, 6:45 PM IST

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు దాదాపు ఏడాది గరిష్ఠానికి పెరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న సౌదీ అరేబియాలోని క్రూడ్ స్థావరాలపై హౌతీ తిరుగుబాటుదారులు ఆదివారం దాడికి తెగబడటం వల్ల ధరలు ఈ స్థాయికి పెరిగాయి.

Crude oil price hike after attack on Saudi oil site
సౌదీపై దాడితో పెరిగిన చమురు ధరలు

సౌదీ అరేబీయాలోని చమురు క్షేత్రాలపై ఆదివారం హౌతీ తిరుగుబాటుదారుల దాడుల తర్వాత అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ దాడితో బ్రెంట్ క్రూడ్ ధర ఏడాది కాలంలో తొలిసారి (బ్యారెల్​కు) 70 డాలర్లపైకి చేరింది. బ్యారెల్​ ముడి చమురు ధర సోమవారం 1.14 డాలర్లు పెరిగి.. 70.74 డాలర్లకు చేరింది. గత శుక్రవారంతో పోలిస్తే ఈ ధర 2.62 డాలర్లు ఎక్కువ.

అమెరికా బెంచ్​ మార్క్ ముడి చమురు ధర కూడా బ్యారెల్​కు 1.10 డాలర్లు పెరిగి.. 67.19 డాలర్ల వద్దకు చేరింది. శుక్రవారం దీని ధర 66.09 డాలర్ల వద్ద ఉంది.

కరోనా మహమ్మారి వల్ల గత ఏడాది రికార్డు స్థాయిలో తగ్గిన ముడి చమురు ధరలు ఇటీవలి నెలల్లో తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. హౌతీ తిరుగుబాటుదారుల దాడితో ఏకంగా ఏడాది గరిష్ఠానికి చేరాయి.

ఇదీ చదవండి:రెండు సెకన్లకు ఒక ఈ-స్కూటర్‌ తయారీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.