ETV Bharat / business

ఎస్​ బ్యాంకు షేర్లపై పరిమితులు విధించిన ఎన్​ఎస్ఈ - ఎస్​ బ్యాంకు

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్​ఎస్​ఈ) ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్​తో సహా వివిధ విభాగాల్లోని ఎస్​ బ్యాంకు షేర్లపై ఆంక్షలు విధించింది. నోటిఫికేషన్ ప్రకారం, డెబ్ట్​, సెక్యూరిటీ లెండింగ్ అండ్​ బారోయింగ్ స్కీమ్​, కరెన్సీ డెరివేటివ్స్​లపై కూడా పరిమితులు విధించారు.

NSE puts restrictions on Yes Bank shares
ఎస్​ బ్యాంకు షేర్లపై పరిమితులు విధించిన ఎన్​ఎస్ఈ
author img

By

Published : Mar 6, 2020, 1:23 PM IST

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్​ఎస్​ఈ) ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్​తో సహా వివిధ విభాగాల్లోని ఎస్​ బ్యాంకు షేర్లపై ఆంక్షలు విధించింది. తాజా పరిణామాల్లో ఆ బ్యాంకు షేర్లు ఓ దశలో 85 శాతం వరకు నష్టపోయాయి.

ఎస్‌ బ్యాంక్‌ బోర్డును రద్దు చేసిన ఆర్బీఐ.. 30 రోజుల పాటు తమ అదుపులో ఉంచుకోనున్నట్లు గురువారం ప్రకటించింది. ఇప్పటికే ఈ బ్యాంక్‌పై మారటోరియం విధించి విత్‌డ్రా పరిమితి రూ.50వేలుగా నిర్ణయించింది.

పరిమితులు

ఎన్​ఎస్​ఈ నోటిఫికేషన్ ప్రకారం, డెబ్ట్​, సెక్యూరిటీ లెండింగ్ అండ్​ బారోయింగ్ స్కీమ్​, కరెన్సీ డెరివేటివ్స్​, కమోడిటీ డెరివేటివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్​పై పరిమితులు విధించారు.

ఎస్​ బ్యాంకులో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో, ఇకపై కొత్తగా బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడంగానీ, పునరుద్ధరించడంగానీ జరగదని, స్థిర డిపాజిట్ రశీదులు అంగీకరించడం జరగదని ఎన్​ఎస్​ఈ స్పష్టం చేసింది. అలాగే ఎన్​ఎస్​ఈ క్లియరింగ్ లిమిటెడ్​కు అనుకూలంగా.. ఎస్ బ్యాంకు జారీచేసిన బ్యాంకు గ్యారెంటీలు, ఫిక్స్​డ్ డిపాజిట్ల రశీదుల ప్రయోజనం కూడా తగ్గనుంది.

ఎస్​ బ్యాంకు ఇటీవల కాలంలో తీవ్రమైన పాలనా పరమైన సమస్యలు ఎదుర్కొంది. క్రమంగా బ్యాంకు నష్టాలపాలయ్యింది.

బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ కుమార్​

ఎస్​ బ్యాంకు పాలనాధికారిగా ప్రశాంత్ కుమార్ ఇవాళ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన ఎస్​బీఐ మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఎస్​ఎఫ్​ఓ .

ఇదీ చూడండి: ఎస్​ బ్యాంక్​ ప్రభావంతో ఫోన్​పే సేవలు బంద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.