ETV Bharat / business

బీఆర్​ఓకు సరికొత్త అర్థం చెప్పిన ఆనంద్​ మహీంద్రా - లేహ్​

ప్రతిష్ఠాత్మక అటల్​ టన్నెల్​ను నిర్మించిన బోర్డర్​ రోడ్స్​ ఆర్గనైజేషన్​(బీఆర్​ఓ)కు భారతరత్న ఇవ్వాలని అభిప్రాయపడ్డారు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్​ మహీంద్రా. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సొరంగ నిర్మాణం పూర్తిచేసిన బీఆర్​ఓను.. భారతరత్న ఆర్గనైజేషన్​ అనాలని ట్వీట్​ చేశారు.

mahindra
బీఆర్​ఓ అంటే భారతరత్న ఆర్గనైజేషన్​: మహీంద్రా
author img

By

Published : Oct 3, 2020, 9:45 PM IST

హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గం అటల్‌ టన్నెల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. సముద్రమట్టానికి 10వేల అడుగుల ఎత్తులో 9.2 కిలోమీటర్ల మేర ఉన్న ఈ సొరంగ మార్గం నిర్మాణంలో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌(బీఆర్‌ఓ) కీలక పాత్ర పోషించింది. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా.. బీఆర్‌ఓను ప్రత్యేకంగా అభినందించారు. అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని సొరంగ నిర్మాణం పూర్తిచేసిన సరిహద్దు రహదారుల సంస్థకు భారత రత్న ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

ANAND MAHINDRA
ఆనంద్​ మహీంద్రా ట్వీట్​

'సంస్థలకు భారతరత్న పురస్కారం ఇవ్వొచ్చో లేదో కచ్చితంగా తెలియదు గానీ.. వీరత్వం, కఠినశ్రమతో పనిచేసే బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ మాత్రం ఇందుకు అర్హమైనది. ఇక బీఆర్‌ఓను భారతరత్న ఆర్గనైజేషన్‌ అనాలి'

- ట్విట్టర్​లో ఆనంద్​ మహీంద్రా

హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీ-లేహ్‌ జాతీయ రహదారిపై లాహౌల్‌-స్పిటీ జిల్లాలో రోహ్‌తంగ్‌ పాస్‌ వద్ద 9.2 కిలోమీటర్ల మేర ఈ సొరంగాన్ని నిర్మించారు. అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో ఈ సొరంగాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీంతో మనాలి-లేహ్‌ల మధ్య 46 కిలోమీటర్ల దూరం తగ్గింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.