ETV Bharat / business

అమెజాన్​ ఫ్రీ గిఫ్ట్​.. లింక్​ క్లిక్​ చేస్తే అంతే! - అమెజాన్​ 30 వసంతాల గిఫ్ట్​

మీకు బహుమతి వచ్చిందంటూ సామాజిక మాధ్యమాల్లో సందేశాలు రావడం చూస్తుంటాం. ఇలాంటి మెసేజ్​లు వైరల్​గా మారుతుంటాయి. ఆ కోవకు చెందిన అమెజాన్​ గిఫ్ట్​ సందేశం ఇప్పుడు వాట్సాప్​లో చక్కర్లు కొడుతోంది. అయితే ఆశతో.. ఇచ్చిన లింక్​పై క్లిక్ చేస్తే మీ వివరాలకు సంబంధించిన సర్వే ఒకటి దర్శనం ఇస్తుంది. ఆ ప్రశ్నావళి పూర్తి చేస్తే బహుమతి వచ్చినట్టే వచ్చి.. చేజారిపోతుంది. ఇలాంటి ఫేక్ మెసేజ్​లను నమ్మవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

No. Amazon is not offering free gifts to all; that WhatsApp message is fake
అమెజాన్​ ఫ్రీ గిఫ్ట్​.. లింక్​ క్లిక్​ చేస్తే అంతే!
author img

By

Published : Mar 28, 2021, 5:10 PM IST

సామాజిక మాధ్యమాల్లో ఫేక్​ న్యూస్​లకు కొదవే లేదు. అవి విపరీతంగా చక్కర్లు కొడుతుంటాయి. అందులోనూ 'మీకు ఈ ఆఫర్ దక్కింది, ఈ లింక్​ని క్లిక్​ చేయండి.. బహుమతి పొందండి' అంటూ వచ్చే సందేశాలు కోకొల్లలు. ప్రస్తుతం.. ఇలాంటి సందేశమే ప్రముఖ సామాజిక మాధ్యమం 'వాట్సాప్​' లో తెగ ఫార్వర్డ్​ అవుతోంది.

సందేశంలో ఏముంది...

'ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్..​ 30వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ వినియోగదారులందరికీ ఉచిత బహుమతులు అందిస్తోంది. మీరూ వాటిని పొందాలి అంటే కింద ఉన్న లింక్​ను క్లిక్​ చేయండి.' అని ఉండే సందేశం వాట్సాప్​ గ్రూపుల్లో ఫార్వర్డ్​ అవుతోంది. ఇందులో ఉండే లింక్ 'అమెజాన్' అని ఇంగ్లీషులో ఉంటుంది. అయితే అక్కడే దెబ్బ పడుతుంది. అందులో.. కనిపెట్టలేని విధంగా చిన్న ఆక్షర దోషంతో ఉంటుంది.

క్లిక్​ చేస్తే గిఫ్టు వస్తుందా..?

ఫార్వర్డ్ సందేశంలో ఉన్నట్లుగా ఇచ్చిన లింక్​ మీద క్లిక్​ చేస్తే అది మొదటగా మిమ్మల్ని ఓ సర్వేకు తీసుకువెళ్తుంది. దానిపై అమెజాన్ లోగో కూడా ఉంటుంది. లోగోను చూసి చాలా మంది నిజమే అనుకుని, వాళ్లు ఇచ్చిన సర్వేని పూర్తి చేస్తారు. ఆ తరువాత ఓ తొమ్మిది సెట్లు ఉండే బాక్స్​ కనిపిస్తుంది. ఏదైనా ఒక దానిని ఎంచుకోవాలని చూపిస్తుంది. చెప్పినట్లుగానే అందులో ఓ బహుమతి ఉంటుంది. కానీ.. అది పొందాలి అంటే లింక్​ను వాట్సాప్‌లోని 5 గ్రూపులకు కానీ మీ ఫోన్​లో ఉండే 20మంది స్నేహితులకు గానీ ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుందని చూపిస్తుంది.

ఎందుకిలా?

వాట్సప్​లో లింక్​ ఫార్వర్డ్​ అవడానికి చివరి ఘట్టమే కారణం. బహుమతి మీద ఆశతో చాలా మంది వెనకా ముందు ఆలోచించకుండా షేర్ చేయడం ప్రారంభిస్తారు. అలా చేసి చివరికి మోసపోతారు. బహుమతి ఉండదు.

ఇవి కొత్త కాదు...

వాట్సప్​లో ఇలా ఫార్వర్డ్​ సందేశాలు రావడం కొత్తేమి కాదు. వివిధ బ్రాండ్​ల పేరుతో రోజుకో విధంగా సందేశాలు వస్తుంటాయి. స్టార్‌బక్స్ నుంచి ఉచిత థర్మో ఫ్లాస్క్, అడిడాస్ నుంచి ఉచితంగా షూ, విమానయాన సంస్థల నుంచి టిక్కెట్లు వంటి వైరల్ సందేశాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్ పేర్లతో ఉన్నా..స్పెల్లింగ్ తప్పుగా ఉంటాయి. అలాంటి సమయంలో వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది అని అంటున్నారు నిపుణులు.

ఇలా నిర్ధరించుకోండి..

  • మీకు వచ్చిన సందేశంలో ఉండే లింక్​ను ముందుగా చూడండి. అందులో ఇచ్చిన బ్రాండ్​ పేరును ఓసారి సరిచూసుకోండి. ఉదా.. Amazonకి బదులుగా amazsocn అని ఉండడం వంటివి మీరు చూడవచ్చు. ఇలా ఉంటే తప్పు అని నిర్ధరించుకోవచ్చు.
  • ఫార్వర్డ్​ అయిన సందేశాలకు పై భాగంలో 'forwarded many times' అని వాట్సాప్ లేబుల్​ మనకి కనిపిస్తుంది. అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడం ఉత్తమం.
  • నకిలీ యూఆర్​ఎల్​లను గుర్తించాలి. సాధారణంగా మనం చూసే వెబ్​సైట్లు HTTP లేదా WWW అని ఉంటాయి. అలాంటి సమయంలో HTTPS అని ఉండే వాటిని ఎంచుకోవడం ఉత్తమం. చివరన 'ఎస్​' అని ఉన్న వెబ్​సైట్లు సురక్షితం అని అర్థం.

చివరగా.. 'ఏ సంస్థ ఉచితంగా బహుమతులు ఇవ్వదు!' అనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు నిపుణులు.

ఇదీ చూడండి: అమెజాన్​లో​ 'ఫోన్​ ఫెస్ట్​'- వన్​ప్లస్​పై భారీ డిస్కౌంట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.