ETV Bharat / business

త్వరలో భారత మార్కెట్లోకి కొత్త తరం 'పోలో'

author img

By

Published : Apr 11, 2021, 6:26 PM IST

దశాబ్దం కాలంగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో మంచి అమ్మకాలు సాగిస్తోన్న ఫోక్స్​వ్యాగన్​.. పోలోని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి నెక్స్ట్​ జెనరేషన్​ పోలోను ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కంపెనీ ప్యాసింజర్ కార్స్ ఇండియా డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు. ఈ కొత్త మోడల్​లో డిజైన్ పరంగా గణనీయమైన మార్పులు చేయనున్నట్లు తెలిపారు.

Next-gen Volkswagen
త్వరలో భారత్​లో విడుదల కానున్న తరువాతి తరం 'పోలో'

జర్మనీ వాహన తయారీ సంస్థ ఫోక్స్​వ్యాగన్ 2021 చివరి నాటికి హ్యాచ్​బ్యాక్​ సెగ్మెంట్​లో అత్యంత విజయవంతమైన నెక్స్ట్​ జెనరేషన్​ 'పోలో'ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. దీనితో పాటు రెండు కొత్త ఎస్‌యూవీలైన 'అట్లాస్ క్రాస్', 'టైగన్‌'ను భారత మార్కెట్లోకి విడుదల చేయాలని యోచిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కంపెనీ ఇండియా డైరెక్టర్​ ఆశిష్​ గుప్తా తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్లోబల్-స్పెక్ పోలో హ్యాచ్‌బ్యాక్​కు నూతన ఫీచర్లను జోడిస్తూ రూపొందించిన నెక్ట్స్-జెన్ పోలోను కంపెనీ వ్యూహాత్మక వ్యాపార వేదిక అయిన ఎమ్​క్యూబీ-ఏఓ ప్లాట్‌ఫాంపై విడుదల చేయనున్నట్లు గుప్తా వివరించారు.

అప్‌గ్రేడెడ్​ క్యాబిన్‌తో పాటు 11 బీహెచ్‌పీ సామర్థ్యం.. 1.0-లీటర్ ఇంజిన్, 3-సిలిండర్ టర్బోచార్జ్​ పెట్రోల్ ఇంజిన్‌ వంటి సరికొత్త ఫీచర్లను అమర్చనున్నట్లు పేర్కొంది. తేలికపాటి-హైబ్రీడ్ వ్యవస్థనూ అందిచనున్నారు. ఇందుకోసం ప్రత్యామ్నాయంగా 48వోల్టుల లిథియమ్​ అయాన్ బ్యాటరీ ఉంటుందని ఆశిష్ గుప్తా పేర్కొన్నారు. ప్రస్తుత వీ-డబ్ల్యు పోలో 1.0-లీటర్ ఇంజిన్‌తో పనిచేస్తోంది. ఇక నూతనంగా లాంచ్​ చేయబోయే 'పోలో'లో ఇంటీరియర్ డిజైనింగ్​ సైతం సెడాన్‌ తరహాలో ఉంటుందని ఆయన​ తెలిపారు.

ఇవీ చదవండి: సిట్రాయెన్​ 'సీ5 ఎయిర్​క్రాస్'​ వచ్చేసింది

సరికొత్త ఫీచర్లతో హ్యుందాయ్ - ఎస్‌యూవీ అల్కాజ‌ర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.