ETV Bharat / business

మరింత సులభంగా ఐటీ రిటర్నులు

పన్ను చెల్లింపుదారులు మరింత సులభంగా వీటిని దాఖలు చేసేందుకు వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది ఆదాయ పన్ను శాఖ. ఐటీఆర్‌ ఇ-ఫైలింగ్‌ 2.0 పోర్టల్​ను మరిన్ని కొత్త సదుపాయాలతో అందుబాటులోకి తీసుకువచ్చింది.

website available for IT returns
పన్ను రిటర్నులకు కొత్త వెబ్​సైట్
author img

By

Published : Jun 8, 2021, 7:06 AM IST

ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణలో చిక్కులు తొలగించి, పన్ను చెల్లింపుదారులు మరింత సులభంగా వీటిని దాఖలు చేసేందుకు వెబ్‌సైట్‌లో ఆదాయపు పన్ను విభాగం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులూ చేస్తూనే ఉంటుంది. ఈసారి ఐటీఆర్‌ ఇ-ఫైలింగ్‌ 2.0 పోర్టల్‌ మరిన్ని కొత్త సదుపాయాలతో అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటివరకు ఇ-ఫైలింగ్‌ సేవలను అందించిన ‌www.incometaxindiaefiling.gov.in స్థానంలో ‌www.incometax.gov.in లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సమర్పించాలి. ఈ కొత్త పోర్టల్‌తో పన్ను చెల్లింపుదారులకు మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు వీలవుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఈ ఇ-ఫైలింగ్‌ 2.0 పోర్టల్‌లో పలు ఆసక్తికర అంశాలున్నాయి.

ఆదాయాలు దాచలేరు:

రెండేళ్ల నుంచి ఆదాయపు పన్ను రిటర్నుల ఫారాలు పాక్షికంగా పూర్తి చేసి అందుబాటులోకి వస్తున్నాయి. మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌) విధించిన సందర్భాల్లో ఇది రిటర్నులలో కనిపించేది. పొదుపు ఖాతా నుంచి వచ్చిన వడ్డీ, స్వల్ప, దీర్ఘకాలిక మూలధన లాభాల్లాంటివి కనిపించేవి కావు. కానీ, కొత్త వెబ్‌సైటులో వచ్చే ఐటీఆర్‌ ఫారాల్లో అన్నీ ముందే నింపి ఉంటాయి. వేతనం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది, వృత్తి/వ్యాపారాదాయం ఎంత? వడ్డీ, డివిడెండ్‌, మూలధన రాబడి.. ఇలా ప్రతి ఆదాయం గురించిన వివరాలూ ఐటీఆర్‌ పత్రాల్లో ముందే నింపి ఉంటాయి. అందులో మీకు అభ్యంతరాలుంటే.. మార్చుకోవచ్చు. వీటికి సంబంధించిన టీడీఎస్‌, ఎస్‌ఎఫ్‌టీ సర్టిఫికెట్లను జూన్‌ 30లోగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

ఉచితంగా..

ఐటీఆర్‌ను సిద్ధం చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్లను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వీలుంటుంది. ఐటీఆర్‌ 1, 4 (ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌), ఐటీఆర్‌ 2 (ఆఫ్‌లైన్‌)లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్లు ఉన్నాయి. త్వరలోనే ఐటీఆర్‌ 3, 5, 6, 7లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ అందిస్తారు.

ఏ ఖాతా నుంచైనా..

నెట్‌ బ్యాంకింగ్‌తోపాటు, యూపీఐ, క్రెడిట్‌ కార్డు, ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌లాంటి వాటితో ఏ ఖాతా నుంచైనా పన్ను బకాయిని చెల్లించే వీలు కల్పిస్తోంది.

ఒకేచోట..

పన్ను చెల్లింపుదారుడికి సంబంధించిన అన్ని వివరాలూ ఒకే డాష్‌బోర్డుపై కనిపిస్తాయి. దీనివల్ల వచ్చిన నోటీసులు, ఏదైనా అసంపూర్తిగా ఉంటే వాటి వివరాలన్నీ సులువుగా తెలుస్తాయి.

వేగంగా రిఫండ్‌..

గతంతో పోలిస్తే రిటర్నులు వేగంగా ప్రాసెస్‌ చేయడానికి వీలవుతుంది. దీనివల్ల సాధ్యమైనంత తొందరగా రిఫండ్‌ చెల్లింపులు జరగనున్నాయి.

మొబైల్‌ యాప్‌..

పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు కొత్తగా మొబైల్‌ యాప్‌నూ తీసుకొస్తోంది. దీన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నారు.

నేరుగా కలవకుండానే..

పన్ను చెల్లింపులకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ఇచ్చే నోటీసులు, అప్పీలు చేసుకోవడం లాంటివన్నీ అధికారులను నేరుగా సంప్రదించకుండానే.. ఆన్‌లైన్‌లోనే సమస్యను పరిష్కరించుకోవచ్చు.

సమస్య వస్తే..

పన్ను చెల్లింపుదార్లు అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు విపులంగా ఇచ్చిన ప్రశ్నలను చదివి సమాధానాలు తెలుసుకోవచ్చు. రిటర్నుల దాఖలులో ఇబ్బందులు ఉంటే.. కాల్‌సెంటర్‌ను సంప్రదించవచ్చు. వీడియోలు, చాట్‌బాట్‌లాంటివీ ఉంటాయి. నేరుగా కాల్‌సెంటర్‌ ఏజెంటుతోనూ చాటింగ్‌ చేయొచ్చు.

ఇదీ చదవండి:వంట గ్యాస్ సిలిండర్ ఇక సరికొత్తగా.. లాభాలెన్నో...

భారత్‌కు ప్రపంచ బ్యాంకు భారీ ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.