ETV Bharat / business

నెట్​ఫ్లిక్స్ బంపర్​ ఆఫర్​- యూజర్లకు ఫ్రీ మొబైల్ గేమ్స్​ - నెట్​ఫ్లిక్స్ ఆఫర్

ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో పోటీ బాగా పెరుగుతుండటం వల్ల వినియోగదారులను ఆకర్షించేందుకు నెట్​ఫ్లిక్స్ కొత్త ఆఫర్​ను ప్రకటించింది. ఐదు మొబైల్​ గేమ్స్​ను సబ్​స్క్రైబర్లకు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకే ఈ సదుపాయం ఉన్నట్లు తెలిపింది.

Netflix to offer mobile games
నెట్​ఫ్లిక్స్ బంపర్​ ఆఫర్
author img

By

Published : Nov 3, 2021, 5:25 PM IST

వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు సరికొత్త ఆఫర్​ను తీసుకొచ్చింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్​. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఆండ్రాయిడ్ యూజర్లంతా బుధవారం నుంచి నెట్​ఫ్లిక్స్​లో 5 మొబైల్ గేమ్స్ ఉచితంగా ఆడవచ్చని తెలిపింది. ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో పోటీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ బ్లాగ్​ పోస్టులో తెలిపింది.

ఆండ్రాయిట్ యూజర్లకు నెట్​ఫ్లిక్స్ ఫ్రీగా అందిస్తున్న 5 మొబైల్​ గేమ్స్​

  1. స్ట్రేంజర్ థింగ్స్​: 1984(బోనస్ ఎక్స్​పీ)
  2. స్ట్రేంజర్ థింగ్స్ 3: ది గేమ్​(బోనస్ ఎక్స్​పీ)
  3. షూటింగ్ హూప్స్​(ఫ్రోస్టీ పాప్​)​
  4. కార్డ్ బ్లాస్ట్​( అమ్యుజో & రోగ్ గేమ్స్​)
  5. టీటర్ అప్​(ఫ్రోస్టీ పాప్​)

నెట్​ఫ్లిక్స్ సబ్​స్క్రిప్షన్​ ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లంతా ఈ గేమ్స్​ డౌన్​లోడ్ చేసుకుని ఆడవచ్చు. అదనపు రుసుం లేదు. ఎలాంటి ప్రకటనలూ ఉండవు. నెట్​ఫ్లిక్స్​లోకి లాగిన్ అయ్యాక గేమ్స్​ కోసం ప్రత్యేక ట్యాబ్ కనిపిస్తుంది. మీకు నచ్చిన గేమ్ సెలక్ట్ చేసి డౌన్​లోడ్ చేసుకున్న తర్వాత ఆడుకోవచ్చు.

ఈ గేమ్స్ చాలా భాషల్లో అందుబాటులో ఉన్నట్లు నెట్​ఫ్లిక్స్ తెలిపింది. ప్రొఫైల్​లో యూజర్ సెట్​ చేసుకున్న ఆప్షన్​ను బట్టి గేమ్ భాష కూడా ఆటోమేటిక్​గా లోడ్ అవుతుందని పేర్కొంది. లాంగ్వేజ్ సెట్ చేసుకోని యూజర్లకు గేమ్స్ డీఫాల్ట్​గా ఇంగ్లోష్​లోనే వస్తాయని చెప్పింది. కిడ్స్ ప్రొఫైల్స్​కు ఈ గేమ్స్ అందుబాటులో ఉండవని వివరించింది.

ఇదీ చదవండి: దీపావళికి జియో కొత్త స్మార్ట్​ఫోన్ రిలీజ్​- ఎప్పుడు, ఎక్కడ, ఎలా కొనాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.