Netflix Subscription Charges: ఓటీటీ ప్రియులకు నెట్‌ఫ్లిక్స్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉండే దేశాల్లో ఒకటైన భారత్‌లో తన చందాదారులను పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న నెలవారీ చందాల ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశంలో మరింత మందికి చేరువకావాలని భావిస్తోంది ఈ సంస్థ.
కేవలం మొబైల్ ఫోన్లో నెట్‌ఫ్లిక్స్ సేవలను వినియోగించుకునేందుకు గాను ఉన్న రూ.199 ప్లాన్‌ను రూ. 50 మేర తగ్గించింది. తాజా నిర్ణయంతో ఈ ప్లాన్ ధర రూ. 149కు చేరింది. ఇదే నెట్‌ఫ్లిక్స్‌లో బేసిక్ ప్లాన్‌గా ఉంది. ఒక డివైజ్‌లో అన్ని రకాల కంటెంట్‌ను ఈ ప్లాన్‌తో యాక్సెస్ చేసుకోవచ్చని అమెరికాకు చెందిన ఈ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే నాలుగు స్కీన్లతో ప్రీమియం ప్లాన్‌గా ఉన్న రూ.799 ఇప్పుడు మరింత తగ్గి కేవలం రూ. 649కే రాన్నట్లు సంస్థ తెలిపింది. తగ్గించిన ప్లాన్ ధరలు మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చాయని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. దీనితో పాటు నాలుగు డివైజ్‌లు యాక్సిస్ చేసుకునేలా ఉన్న రూ.499 కూడా ఇప్పుడు రూ. 199కే రానున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
-
It's happening! Everybody stay calm! 😱
— Netflix India (@NetflixIndia) December 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
In case you missed it, you can now watch Netflix on any device at #HappyNewPrices. pic.twitter.com/My772r9ZIJ
">It's happening! Everybody stay calm! 😱
— Netflix India (@NetflixIndia) December 14, 2021
In case you missed it, you can now watch Netflix on any device at #HappyNewPrices. pic.twitter.com/My772r9ZIJIt's happening! Everybody stay calm! 😱
— Netflix India (@NetflixIndia) December 14, 2021
In case you missed it, you can now watch Netflix on any device at #HappyNewPrices. pic.twitter.com/My772r9ZIJ
'నెట్‌ఫ్లిక్స్‌లో ఉండే కంటెంట్‌ను భారత్‌లో ఎక్కువమంది వినియోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అందుకే ప్లాన్ ధరలను మరింతగా తగ్గించాం' అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ ఓ మీడియా సంస్థతో చెప్పారు.
"నెట్‌ఫ్లిక్స్ సరికొత్త, విభిన్నమైన కంటెంట్‌ను చందాదారులకు అందిస్తుంది. కంటెంట్ ఎక్కువ మందిని చేరుకునేందుకు ఇప్పటికే డబ్బింగ్, సబ్ టైటిల్స్‌తో ఇస్తున్నాం. పెద్ద మొత్తంలో ఆడియన్స్‌ను చేరుకోవడమే లక్ష్యంగా సినిమాలు, సిరీస్‌లను తీసుకొస్తున్నాం. కరోనా సమయంలో ఏడాదిన్నర కాలంగా భారత్ నుంచి ఎక్కువ మంది నెట్‌ఫ్లిక్స్‌ను మంచి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంగా ఎంచుకున్నారు."
- మోనికా షెర్గిల్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సేవలను వినియోగించుకుంటున్న చందాదారులు మరిన్ని సేవలకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉందని మోనికా షెర్గిల్ అన్నారు.
ఇటీవల అమెజాన్ ప్రైమ్ ధరలు భారీగా పెంచింది. వార్షిక చందాను సమారు రూ.500 మేర పెంచింది. నెట్ఫ్లిక్ మాత్రం ధరలు తగ్గించింది.
ఇవీ చూడండి: