సహజ వాయువు ధరలు మంగళవారం 26 శాతం తగ్గాయి. 2014లో ఫార్ములా ఆధారిత ధరల విధానాన్ని ప్రారంభించిన తర్వాత ఇదే అత్యధిక క్షీణత కావడం గమనార్హం. దీని వల్ల సీఎన్‌జీ, గొట్టపు మార్గం ద్వారా అందించే వంట గ్యాస్ ధరలు తగ్గుతాయి. ఓఎన్‌జీసీ గ్యాస్ తయారుదారు ఆదాయాల్లో భారీ కోత పడనుంది.
ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆరు నెలల కాలానికి గ్యాస్ ఉత్పత్తి ధర మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు 2.39 డాలర్ల వద్ద లెక్కగడతారు. ప్రస్తుతం ఇది 3.23 డాలర్లుగా ఉంది. కాగా, డీప్‌సీ వంటి సంక్లిష్ట క్షేత్రాల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ ధర(ఎంఎంబీటీయూ) సైతం 8.43 డాలర్ల నుంచి 5.61 డాలర్లకు పరిమితమైంది. చివరిసారిగా అక్టోబరు 1న సహజ వాయువు ధరను 12.5 శాతం మేర తగ్గించి 3.69 డాలర్ల నుంచి 3.23 డాలర్లకు చేర్చారు.
ఈ ధరల కోత వల్ల ఓఎన్‌జీసీ ఆదాయాలు రూ.3,000 కోట్ల వరకు తగ్గవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి: దేశంలో 1400కు చేరువలో కరోనా కేసులు.. 35 మంది మృతి