ETV Bharat / business

'ఆ విధానంతో 30 లక్షల అదనపు ఉద్యోగాలు' - 30 లక్షల ఉద్యోగాల సృష్టి

సమన్వయ జాతీయ రిటైల్​ విధానంతో 2024 నాటికి దేశంలో అదనంగా 30 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశం ఉందని సీఐఐ జాతీయ కమిటీ ఛైర్మన్, ఆర్​పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ రిటైల్​-ఎఫ్ ఎమ్​సీజీ అధిపతి శాశ్వత్ గోయెంకా వెల్లడించారు. సాంకేతిక రంగంలో నియామకాలు ఎక్కువగా జరుగుతున్నాయని మరో నివేదిక వెల్లడించడం గమనార్హం.

JOBS
'ఆ విధానంతో 30 లక్షల అదనపు ఉద్యోగాలు'
author img

By

Published : Nov 25, 2020, 7:00 AM IST

రిటైల్​ రంగ ఉన్నతి కోసం తీసుకురాబోతున్న సమన్వయ జాతీయ రిటైల్​ విధానంతో 2024 నాటికి దేశంలో అదనంగా 30 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశం ఉందని సీఐఐ జాతీయ కమిటీ ఛైర్మన్, ఆర్​పీ-సంజీవ్ గోయెంకా గ్రూప్ రిటైల్​-ఎఫ్ ఎమ్​సీజీ అధిపతి శాశ్వత్ గోయెంకా వెల్లడించారు. సీఐఐ ఇండియా రిటైల్ సమ్మిట్-2020లో పాల్గొన్న ఆయన రిటైల్ రంగంపై మాట్లాడారు.

"పరిశ్రమను ముందుకు నడిపించేందుకు కొత్త, అభివృద్ధి చెందుతున్న నమూనాలపై చర్చించాల్సిన అవసరం ఉంది. గిరాకీ తగ్గడం వల్ల పరిశ్రమ ఇప్పటికీ దెబ్బ తింటోంది కాబట్టి వినియోగదార్ల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు చురుకైన చర్యలు తీసుకోవాలి" అని గోయెంకా వివరించారు. రిటైల్ మౌలిక వసతులపై గిడ్డంగులు, శీతలీకరణ కేంద్రాలపై రూ.6,500 కోట్ల మేర పెట్టుబడులు పెడితే మరో 2-3 లక్షల ఉద్యోగాలను సృష్టించవచ్చని అభిప్రాయపడ్డారు. 2021 నుంచి 2027 నాటికి రిటైల్ రంగ పరిణామం రెండింతలు అవుతుందని అంచనా వేశారు.

నియామకాలు మెరుగవుతున్నాయి: లింక్డ్​ఇన్

భారత్​లో గత సెప్టెంబరులో నియామక కార్యకలాపాలు మెరుగయ్యాయని లింక్డ్ ఇన్ నివేదిక వెల్లడించింది. చాలా నెలల క్రితంతో పోలిస్తే ఉద్యోగాల కోసం పోటీ తక్కువగా ఉన్నప్పటికీ, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 30 శాతం ఎక్కువగా ఉందని 'లేబర్ మార్కెట్ అప్డేట్' పేర్కొంది. ముఖ్యంగా సాంకేతికేతర రంగాల్లో ఎక్కువగా నియామకాలు జరుగుతున్నాయని వివరించింది.

ఇదీ చదవండి:ఇప్పట్లో కాంగ్రెస్​కు కొత్త సారథి లేనట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.