ETV Bharat / business

Reliance: 'డిజిటల్​.. మా బలం- బ్యాలెన్స్​ షీట్లూ పటిష్ఠం' - mukesh ambani latest news

రిలయన్స్​ ఇండస్ట్రీస్ వార్షిక నివేదికను బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది రూ. రెండు లక్షల కోట్ల మేర పెట్టుబడులు సాధించినట్లు పేర్కొంది. డిజిటల్‌ విప్లవాన్ని విజయవంతంగా అందిపుచ్చుకునే సంస్థలదే భవిత అని వివరించారు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ.

Mukesh Ambani
అంబానీ, ముకేశ్​ అంబానీ
author img

By

Published : Jun 2, 2021, 8:54 PM IST

Updated : Jun 3, 2021, 8:00 AM IST

రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ వల్ల రుణాలను ముందస్తుగా చెల్లించడంతో తమ బ్యాలెన్స్‌ షీట్లు మరింతగా పటిష్ఠమై, వ్యాపారాభివృద్ధికి కావాల్సిన మొత్తం అందుబాటులో ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. తమ మూడు అధిక వృద్ధి వ్యాపారాలైన జియో, రిటైల్‌, చమురు- రసాయనాల వృద్ధి ప్రణాళికలకు ఈ నిధులు ఉపయోగపడతాయని తెలిపారు. డిజిటల్‌ విప్లవాన్ని విజయవంతంగా అందిపుచ్చుకునే సంస్థలదే భవిత అని వివరించారు. బుధవారం విడుదలైన ఆర్‌ఐఎల్‌ వార్షిక నివేదికలో ముకేశ్‌ ఏమన్నారంటే..

  • 2020-21లో టెలికాం, డిజిటల్‌ వ్యాపారాల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ (రూ.1,52,056 కోట్లు), రిలయన్స్‌ రిటైల్‌ సంస్థ (రూ.47,625 కోట్లు)ల్లో మైనార్టీ వాటాల విక్రయం ద్వారా సుమారు రూ.2 లక్షల కోట్లు, రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లు, ఇంధన రిటైలింగ్‌లో 49 శాతం వాటా విక్రయం ద్వారా రూ.7629 కోట్లను కంపెనీ సమీకరించింది. ఫలితంగా లక్ష్యం (2021 మార్చిలోగా) కంటే ముందుగానే రుణ రహిత కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అవతరించింది. ఆ ఏడాది ఆర్‌బీఐ నుంచి అవసరమైన అనుమతులు తీసుకొని విదేశీ కరెన్సీ రూపంలోని 7.8 బిలియన్‌ డాలర్ల రుణాన్ని ముందుగానే చెల్లించేశాం. ఒక భారతీయ కార్పొరేట్‌ కంపెనీ ముందస్తుగా చెల్లించిన అత్యధిక రుణం ఇదే. ప్రపంచంలో గత పదేళ్లలో బ్యాంకింగేతర సంస్థల విభాగంలో జరిగిన అతి పెద్ద రైట్స్‌ ఇష్యూ కూడా మాదే. ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కోకు విక్రయించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి.
  • గత సంవత్సరం కొవిడ్‌-19 మహమ్మారి రూపంలో సవాళ్లు ఎదురైనా, ఆర్‌ఐఎల్‌ తన అన్ని వ్యాపార విభాగాల్లో వృద్ధి ప్రణాళికలను విజయవంతంగా అమలు చేసింది.
  • కొవిడ్‌-19పై పోరాటానికి ఆసుపత్రుల నిర్మాణంతో పాటు పీపీఈ కిట్లు, ఆక్సిజన్‌ సరఫరా వంటివి చేస్తున్నాం. రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ సంస్థలు డిజిటల్‌ సేవలు, నిత్యావసర వస్తువుల సరఫరాతో దేశానికి ఉపయోగపడ్డాయి.

5జీలో మైలురాయి..

సొంతంగా 5జీ సామర్థ్యాలు: దేశీయంగా 5జీ సొల్యూషన్లను క్వాల్‌కామ్‌తో కలిసి విజయవంతంగా పరీక్షించాం. 5జీ స్మార్ట్‌ఫోన్లపై డేటా వేగం 1 జీబీపీఎస్‌ మైలురాయిని చేరుకున్నాం. ప్రపంచ డిజిటల్‌ విప్లవం’లో భారత్‌ ముందు వరుసలో నిలిచేందుకు తగిన నెట్‌వర్క్‌ను జియో సిద్ధం చేసింది. తదుపరి 30 కోట్ల మంది మొబైల్‌ బ్రాడ్‌బ్యాంక్‌ వినియోగదార్లు, 5 కోట్ల ఫైబర్‌ గృహాలు, 5 కోట్ల ఎంఎస్‌ఎమ్‌ఈలకు సేవలందించే సామర్థ్యమూ ఉంది. ఇప్పటివరకు జియో 5000 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టగా, 42.6 కోట్ల మంది చందాదార్లున్నారు.

కొవిడ్‌-19తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు 5 ఏళ్ల పాటు పూర్తి వేతనం ఇవ్వనున్నట్లు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. రూ.10 లక్షల పరిహారానికి ఇది అదనమని వెల్లడించింది.వారి పిల్లల విద్యా ఖర్చులు డిగ్రీ వరకు భరిస్తామంది.

ఇదీ చూడండి: ముంబయి రైల్వేస్టేషన్‌ రేసులో జీఎంఆర్‌ గ్రూపు

Last Updated : Jun 3, 2021, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.