ETV Bharat / business

100 బిలియన్ డాలర్ల క్లబ్​లోకి ముకేశ్ అంబానీ! - వారెన్ బఫెట్​ ఆస్తి ఎంత

ముకేశ్ అంబానీ 100 బిలియన్ డాలర్ల క్లబ్​లో చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు (Reliance Share price) సోమవారం సరికొత్త రికార్డు స్థాయిని తాకిన నేపథ్యంలో ముకేశ్ సంపద (Mukesh Ambani is now worth) తొలిసారి 100 బిలియన్ డాలర్ల మార్క్​ను తాకింది.

Mukesh Ambani
ముకేశ్ అంబానీ
author img

By

Published : Sep 6, 2021, 3:13 PM IST

Updated : Sep 6, 2021, 7:19 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్​ అంబానీ సరికొత్త రికార్డు సృష్టించారు. సోమవారం ఆయన సంపద (Mukesh Ambani is now worth) తొలిసారి 100 బిలియన్​ డాలర్ల మార్క్​ను దాటింది. కంపెనీ షేర్లు భారీగా పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణం.

రిలయన్స్ షేర్లు (Reliance Share price) సోమవారం ఒకానొక దశలో 3 శాతం ఎగబాకాయి. దీనితో కంపెనీ మార్కెట్ క్యాపిటల్ (Reliance M-cap)​ రూ.16.3 (223 బిలియన్​ డాలర్లు) లక్షల కోట్లు దాటింది. ఫలితంగా కంపెనీలో మెజారిటీ వాటా ఉన్న ముకేశ్​ సంపద 100 బిలియన్​ డాలర్లపైకి చేరింది. ఆసియాలో ఈ స్థాయికి సంపద చేరిన.. తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం.

షేర్లు దూకుడుకు కారణాలు..

రిలయన్స్ చమురు వ్యాపారాల్లో 20 శాతం వాటా సౌదీ ఆరామ్​కోకు విక్రయించే ప్రక్రియ దాదాపు ముగింపు దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

జియో ఆదాయం.. సగటున ఒక యూజర్​ నుంచి సగటున రూ.160-170గా నమోదైనట్లు ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి.

గ్రీన్ ఎనర్జీపై భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు రిలయన్స్ ఇప్పటికే స్పష్టం చేసింది.

టెలికాం సంస్థ టీ-మొబైల్​ నెదర్లాండ్స్​ను 5.7 బిలియన్​ డాలర్లతో స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతున్నట్లు వార్తలు వస్తుండటం సహా అనేక ఇతర సానుకూలతలతో రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్లు సోమవారం జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి.

100 బిలియన్ డాలర్ల క్లబ్​లోని ఇతర వ్యక్తులు వీరే..

  1. జెఫ్​ బెజోస్ (అమెజాన్ అధినేత)​- 200.7 బిలియన్​ డాలర్లు
  2. ఎలాన్ మస్క్​ (టెస్లా సీఈఓ) - 198.9 బిలియన్ డాలర్లు
  3. బెర్నార్డ్​ ఆర్నల్డ్ (ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్​)​ - 163.6 బిలియన్ డాలర్లు
  4. బిల్​గేట్స్​ (మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు) - 153.6 బిలియన్​ డాలర్లు
  5. ల్యారీ పేజ్ (గూగుల్ సహ వ్యవస్థాపకుడు)​- 128.1 బిలియన్ డాలర్లు
  6. సెర్గి బ్రిన్​ (గూగుల్ సహ వ్యవస్థాపకుడు)- 123.6 బిలియన్​ డాలర్లు
  7. స్టీవ్ బామర్​​ (ప్రముఖ వ్యాపారవేత్త) - 107.6 బిలియన్ డాలర్లు
  8. ల్యారీ ఎలీసన్​ (ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు) - 103.8 బిలియన్ డాలర్లు
  9. వారెన్ బఫెట్​ (ప్రముఖ ఇన్వెస్టర్​) - 102.6 బిలియన్ డాలర్లు
  • నోట్​: ఆయా వ్యక్తుల సంపద వివరాలు బ్లూమ్​బర్గ్ తాజా రిపోర్ట్​ ద్వారా తెలిసినవి.

ఇదీ చదవండి: బ్యాంకులకు వరుస సెలవులు- వారంలో ఐదు రోజులు బంద్!

Last Updated : Sep 6, 2021, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.