ETV Bharat / business

100 బిలియన్​ డాలర్ల ప్రత్యేక క్లబ్‌లోకి అంబానీ! - reliance industries news

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) మరో అరుదైన ఘనత సాధించారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) షేర్ల విలువ శుక్రవారం రికార్డు స్థాయికి చేరాయి. దీంతో ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బిల్‌ గేట్స్‌ సహా అతికొద్ది మందితో కూడిన 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో (Mukesh Ambani Net Worth) చేరారు ముకేశ్.

mukesh ambani net worth
ముకేశ్ అంబానీ
author img

By

Published : Oct 9, 2021, 8:30 PM IST

భారత్‌లో అగ్రగామి 100 మంది కుబేరుల జాబితాలో వరుసగా 14వ ఏడాది తొలి స్థానంలో నిలిచిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఎలాన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, బిల్‌ గేట్స్‌ సహా అతికొద్ది మందితో కూడిన 100 బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరారు. శుక్రవారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) షేర్ల విలువ రికార్డు స్థాయికి చేరడం వల్ల ముకేశ్‌ అంబానీ సంపద విలువ 100 బి.డాలర్లు (Mukesh Ambani Net Worth) దాటింది. ఈ ఏడాది ఆయన సంపద 23.8 బి.డాలర్ల మేర పెరగడం విశేషం. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ (Bloomberg Billionaires Index 2021) ప్రకారం ప్రస్తుతం ఆయన సంపద విలువ 101 బి.డాలర్లుగా ఉంది.

హరిత ఇంధన రంగంలోకీ ప్రవేశించనున్నట్లు అంబానీ గత జూన్‌లో (Mukesh Ambani News) ప్రకటించారు. ఇందుకోసం వచ్చే మూడేళ్లలో దాదాపు 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. మరోవైపు 2030 కల్లా పునరుత్పాదక వనరుల నుంచి కనీసం 100 గిగావాట్ల విద్యుదుత్పత్తి సాధిస్తామని పేర్కొన్నారు. ఒక దశాబ్ద కాలంలో 1 కిలో హైడ్రోజన్‌ వ్యయాన్ని 1 డాలరు లోపునకు తీసుకురావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

అలాగే ప్రస్తుతం రిలయన్స్‌ గ్రూప్ (Reliance News) ఆదాయంలో సింహభాగమైన ఇంధన వ్యాపారంపైనా ముకేశ్‌ (Mukesh Ambani News) పటిష్ఠ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం ఆరామ్‌కోతో ఒప్పందం (Aramco Reliance Deal) కుదుర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. దాదాపు 73 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయం కలిగిన రిలయన్స్‌లో.. ఇప్పటికీ 60 శాతం వాటా చమురు ఆధారిత ఇంధన వనరులదే. ఈ నేపథ్యంలోనే ఆరామ్‌కోతో ముందుకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు.

ఈ పరిణామాలన్నింటినీ.. అవకాశంగా భావిస్తున్న మదుపర్లు రిలయన్స్‌ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani News) తాజా ప్రకటనన్నీ శిలాజ ఇంధన శకం అనంతరం కూడా రిలయన్స్‌ విజయవంతమైన మనుగడకు హామీలని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి!

బ్లూమ్‌బెర్గ్‌ బిలయనీర్స్ జాబితా ప్రకారం.. 100 బి.డా క్లబ్‌లో ఉన్నది వీరే..

ఎలాన్‌ మస్క్‌ 222 బి.డా
జెఫ్‌ బెజోస్‌ 191 బి.డా
బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ 156 బి.డా
బిల్‌ గేట్స్‌ 128 బి.డా
లారీ పేజ్‌ 125 బి.డా
మార్క్‌ జుకర్‌బర్గ్‌ 123 బి.డా
సెర్గీ బ్రిన్‌ 120 బి.డా
లారీ ఎలిసన్‌ 108 బి.డా
స్టీవ్‌ బామర్‌ 106 బి.డా
వారెన్‌ బఫెట్‌ 103 బి.డా
ముకేశ్‌ అంబానీ 101 బి.డా

ఇదీ చూడండి: Forbes Richest List: భారత​ కుబేరుల్లో అగ్రస్థానంలో అంబానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.