ETV Bharat / business

2020-21లో ముకేశ్ అంబానీ జీతం 'సున్నా' - ముకేశ్ అంబానీ శాలరీ

2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ స్వచ్ఛందంగా తన వేతనాన్ని వదులుకున్నారు. కరోనా కారణంగా ఆర్థిక రంగం దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

mukesh ambani
ముకేశ్ అంబానీ
author img

By

Published : Jun 3, 2021, 2:04 PM IST

Updated : Jun 3, 2021, 4:25 PM IST

ప్రముఖ వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్​ అధినేత ముకేశ్ అంబానీ.. 2020-21లో ఒక్క రూపాయి జీతం అయినా తీసుకోలేదు. కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను, వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో.. తన వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు.

ఇటీవలే రిలయన్స్ ప్రకటించిన తన వార్షిక నివేదికలో ముకేశ్ అంబానీ జీతాన్ని 'జీరో'గా చూపించింది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ.. ముకేశ్​ అంబానీ రూ.15 కోట్లను వేతనంగా పొందారు. 11 ఏళ్లుగా ఇదే మొత్తాన్ని వేతనంగా అందుకుంటున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి వేతనం, ఇతర అలవెన్సుల మొత్తాన్ని రూ.15 కోట్ల వద్ద స్థిరంగా ఉంచారు. నిజానికి ఈ మొత్తం ఏడాదికి రూ.24 కోట్లుగా ఉండాలి.

వారి వేతనాల్లో మార్పు లేదు..

ముకేశ్ బంధువులైన నిఖిల్​, హితాల్ మోస్వానీల వేతనాలు మాత్రం గత ఆర్థిక సంవత్సరం రూ.24 కోట్ల వద్ద స్థిరంగా ఉంది. ఇందులో రూ.17.28 కోట్లను వారు కమీషన్​గా పొందినట్లు ఆర్​ఐఎల్​ వెల్లడించింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్లు పి.ఎం.ఎస్ ప్రసాద్​, పవర్​ కుమార్​ కపిల్​లు 2020-21లో రూ.17.28 కోట్ల వేతనాన్ని అందుకున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి:Reliance: 'డిజిటల్​.. మా బలం- బ్యాలెన్స్​ షీట్లూ పటిష్ఠం'

Last Updated : Jun 3, 2021, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.