ETV Bharat / business

Most Popular Websites 2021: గూగుల్​ను దాటేసిన టిక్​టాక్​..! - టిక్​టాక్ న్యూస్​

Most Popular Websites 2021: ఈ ఏడాది టెక్ దిగ్గజం గూగుల్​ను అధిగమించింది టిక్​టాక్. అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్​సైట్​గా నిలిచిందని ఐటీ భద్రతా సంస్థ క్లౌడ్‌ఫ్లేర్‌ వెలువరించిన నివేదికలో తెలిపింది.

The most popular website in 2021
టిక్​టాక్​
author img

By

Published : Dec 25, 2021, 6:57 PM IST

Most Popular Websites 2021: ప్రముఖ షార్ట్‌ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌ టిక్‌టాక్‌, టెక్‌ దిగ్గజమైన గూగుల్‌ను అధిగమించి ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ కలిగిన వెబ్‌సైట్‌గా నిలిచిందని ఐటీ భద్రతా సంస్థ క్లౌడ్‌ఫ్లేర్‌ వెలువరించిన నివేదికలో తెలిపింది. వైరల్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ యూఎస్‌ ఆధారిత సెర్చ్ ఇంజిన్‌ గూగుల్‌ కంటే అధికంగా హిట్‌లను అందుకుందని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, జూన్​లలో గూగుల్‌ అగ్రస్థానంలో ఉండగా ఆగస్ట్‌ నుంచి టిక్‌టాక్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ర్యాంకింగ్‌లు సూచిస్తున్నట్లు వెల్లడించారు.

Most Visited Websites in 2021:

2020లో గూగుల్‌ అగ్రస్థానంలో నిలవగా టిక్‌టాక్‌ సహా అమెజాన్‌, ఆపిల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఇతర సైట్‌లు టాప్‌ టెన్‌ జాబితాలో చోటుదక్కించుకున్నాయని నివేదికలో పేర్కొన్నారు. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, వినోదం కోసం టిక్‌టాక్‌ను ఎక్కువగా ఆస్వాదించడం టిక్‌టాక్‌కు జనాదరణ పెరగడానికి కారణమైందని తెలిపారు.

ఇదీ చదవండి: మార్కెట్​ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఇలా చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.