ETV Bharat / business

GDP Growth: ఈసారి జీడీపీ వృద్ధి 9.3%!

భారత జీడీపీ వృద్ధి(GDP Growth) 2021-22 ఆర్థిక సంవత్సరానికి 9.3 శాతంగా నమోదవుతుందని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 7.9శాతంగా ఉంటుందని పేర్కొంది. లాక్‌డౌన్ నిబంధనలు దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపడంలేదని అభిప్రాయపడింది.

Moody's pegs India GDP growth at 9.3 pc in FY22
GDP Growth: ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 9.3%!
author img

By

Published : Jun 1, 2021, 11:55 AM IST

2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల జాతీయోత్పత్తి 9.3 శాతం మేర వృద్ధి(GDP Growth) సాధిస్తుందని ప్రముఖ రేటింగ్స్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.9 శాతంగా ఉండొచ్చని తెలిపింది. కరోనా తొలి దశలో మాదిరి రెండో దశ విలయం కట్టడికి దేశంలో వివిధ రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్ నిబంధనలు దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపడంలేదని అభిప్రాయపడింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం మేర క్షీణత నమోదు చేసినట్లు మూడీస్​ తెలిపింది. దీర్ఘకాలంలో వాస్తవిక జీడీపీ వృద్ధిరేటు(GDP Growth) సగటు 6 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మూడీస్ వివరించింది. మహమ్మారి కారణంగా మరిన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని స్పష్టం చేసింది. కరోనాకు ముందున్న సవాళ్లు మరింత కఠినతరమవుతాయని చెప్పింది.

ఇదీ చూడండి: '2020-21లో దేశ జీడీపీ 7.3% క్షీణత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.