భారత్‌లో ప్రీమియం ఫోన్ల కంటే బడ్జెట్, మిడ్ సెగ్మెంట్ ఫోన్లకే ఎక్కువ మంది మొగ్గుచూపుతుంటారు. కంపెనీలు కూడా ఈ సెగ్మెంట్లలో మంచి ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. మిడ్ సెగ్మెంట్లో అన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ సెగ్మెంట్ కోసం సబ్ బ్రాండ్లను సృష్టించుకుంటున్నాయి.
రూ. 15వేల నుంచి రూ. 25వేల సెగ్మెంట్లో ఈ సంవత్సరం విడుదలైన కొన్ని ఫోన్ల వివరాలు చూద్దాం..
వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ :
![mid segment phones released this year](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109568_7.jpg)
ఇది జూన్‌లో విడుదలైంది. ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ ఇందులో ఉంది. వెనుక భాగంలో మూడు కెమెరాలు, ముందు ఒక కెమెరా ఉంది. మూడు కలర్లలో ఇది లభ్యమవుతోంది.
ఫీచర్లు..
- 6.43 అంగుళాల స్క్రీన్ (1080x2400)
- ప్రాసెసర్ - క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 750జీ
- మెమోరీ - 6జీబీ+128జీబీ
- ఫ్రంట్ కెమెరా - 16 ఎంపీ
- రియర్ కెమెరా - 64 ఎంపీ+ 8ఎంపీ+ 2 ఎంపీ
- బ్యాటరీ సామర్థ్యం - 4500 ఎంఏహెచ్
- ధర- రూ. 22,999
వివో వై31
![mid segment phones released this year](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109568_3.jpg)
జనవరిలో విడుదలైన ఈ ఫోన్లో ఆక్టాకోర్ క్వాల్కమ్ ప్రాసెసర్ ఉంది. 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా ప్రత్యేకతలు.
ఫీచర్లు..
- 6.58 అంగుళాల డిస్ప్లే (1080x2400)
- ప్రాసెసర్ - క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662
- మెమోరీ- 6జీబీ+128జీబీ
- ఫ్రంట్ కెమెరా - 16ఎంపీ
- రియర్ కెమెరా - 48 ఎంపీ +2ఎంపీ +2ఎంపీ
- బ్యాటరీ సామర్థ్యం - 5000 ఎంఏహెచ్
- ధర - రూ. 16,490(6జీబీ+128జీబీ)
పోకో ఎక్స్ 3 ప్రో
![mid segment phones released this year](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109568_2.jpg)
ఈ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ వల్ల అన్ని టాస్క్ లను స్పీడ్‌గా చేయగలదు. డిజైన్, కెమెరా బంప్ యువతను ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ 5జీ కాదు.
- 6.67 అంగుళాల డిస్ ప్లే (1080x2400)
- ప్రాసెసర్ - క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860
- మెమోరీ - 6జీబీ+128జీబీ
- ఫ్రంట్ కెమెరా -20 ఎంపీ
- రియర్ కెమెరా - 48 ఎంపీ+8 ఎంపీ
- బ్యాటరీ సామర్థ్యం - 5160 ఎంఏహెచ్
- ధర- రూ. 18,999
రెడ్ మీ నోట్ 10 ప్రో
![mid segment phones released this year](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109568_4.jpg)
ఇది మార్చిలో విడుదలైంది. 6.67 అంగుళాల డిస్ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఉన్న ఎంఐ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ. 15999గా ఉంది.
- 6.67 అంగుళాల డిస్ ప్లే
- ప్రాసెసర్ - క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732జీ
- మెమోరీ- 6జీబీ+64జీబీ
- ఫ్రంట్ కెమెరా - 16ఎంపీ
- రియర్ కెమెరా - 64 ఎంపీ+8ఎంపీ+5 ఎంపీ+2ఎంపీ
- బ్యాటరీ సామర్థ్యం - 5050 ఎంఏహెచ్
- ధర - రూ. 15,999
మోటోరోలా మోటో జీ60
![mid segment phones released this year](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109568_9.jpg)
మోటోరోలా నుంచి వచ్చిన మొదటి 108 మెగా పిక్సల్ ఫోన్ ఇది. 9.8 ఎంఎం మందంతో 225 గ్రాముల బరువు ఉంటుంది.
- 6.80 అంగుళాల డిస్ప్లే (1080x2460)
- ప్రాసెసర్ - క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732జీ
- మెమోరీ -6జీబీ+128జీబీ
- ఫ్రంట్ కెమెరా - 32ఎంపీ
- రియర్ కెమెరా -108 ఎంపీ+8ఎంపీ + 2ఎంపీ
- బ్యాటరీ సామర్థ్యం - 6000 ఎంఏహెచ్
- ధర - రూ. 17,999
రియల్ మీ 8 ప్రో
![mid segment phones released this year](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109568_imgs.jpg)
రియల్ 7ప్రో స్థానంలో విడుదలైన ఫోన్ ఇది. ఇందులో 108 మెగా పిక్సల్ భారీ కెమెరా ఉంది.
- 6.40 అంగుళాల డిస్ ప్లే (1080x2460)
- ప్రాసెసర్ -క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 720జీ
- మెమోరీ - 6జీబీ+128జీబీ
- ఫ్రంట్ కెమెరా - 16ఎంపీ
- రియర్ కెమెరా - 108 ఎంపీ+ 8ఎంపీ +2ఎంపీ +2ఎంపీ
- బ్యాటరీ సామర్థ్యం - 4500 ఎంఏహెచ్
- ధర - రూ. 17999
ఇదీ చదవండి : Smartphone: అదిరే ఫీచర్లతో టెక్నో 'స్పార్క్ 7టీ'