Maruti suzuki rate hike: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. మరో రేట్ 'హైక్'కు సిద్ధపడింది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల కారణంగా.. వచ్చే ఏడాది జనవరిలో వాహనాల ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. అయితే ఏ మోడల్‌కు ఎంత పెంచనుందనే విషయాన్ని సంస్థ ఇంకా వెల్లడించలేదు.
"గత కొంతకాలంగా ఉత్పత్తి ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అందువల్ల సంస్థపై భారం పడుతోంది. ఈ భారంలో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపక తప్పడం లేదు. జనవరిలో కార్ల రేట్లు పెంచుతున్నాం."
-- మారుతీ సుజుకీ ఇండియా.
2021లో సంస్థ ఇప్పటికే మూడుసార్లు రేట్లు పెంచింది. జనవరిలో 1.4శాతం, ఏప్రిల్‌లో 1.6శాతం, సెప్టెంబర్‌లో 1.9శాతం.. మొత్తం మీద ఈ ఒక్క ఏడాదిలోనే ధరలను 4.9శాతం పెంచింది.
ఆల్టో నుంచి ఎస్యూవీ వరకు మారుతీలో ఎన్నో మోడళ్లు ఉన్నాయి. దిల్లీ ఎక్స్ షోరూం ధరలు రూ.3.15 లక్షల నుంచి మొదలవుతాయి.
ఆడి కూడా..
Audi rate in India: జర్మనీకి చెందిన విలాస కార్ల సంస్థ ఆడి కూడా ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. అన్ని మోడళ్లపై 3శాతం ధరను పెంచుతున్నట్టు వెల్లడించింది. ఇది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడమే ఇందుకు కారణమని వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో ఏ4, ఏ6, ఏ8 ఎల్, క్యూ2, క్యూ5, క్యూ8, ఎస్5 స్పోర్ట్‌బ్యాక్, ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్, ఆర్ఎస్ 7, ఆర్ఎస్ క్యూ8, ఈ-ట్రాన్ 50, ఈ-ట్రాన్ 55, ఈ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 2021లోనే 9 కొత్త మోడళ్లను ఆవిష్కరించింది ఆడి. వీటిల్లో రెండు విద్యుత్ కార్లు ఉన్నాయి.
ఇవీ చూడండి:-