Maruti Suzuki Hikes Vehicle Prices: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) వాహనాల ధరలను పెంచింది. కార్ల ధరలను 4.3శాతం వరకు పెంచినట్లు తెలిపింది. పెంచిన వాహనాల ధరలు శనివారమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ముడి పదార్థాల వ్యయాలు పెరిగిన కారణంగా వాహనాల ధరలను పెంచినట్లు తెలిపింది మారుతీ సుజుకీ.
"మారుతీ సుజుకీలోని వివిధ మోడల్ వాహనాలపై ధరలను 0.1 నుంచి 4.3శాతం వరకు పెంచాము. దిల్లీలోని ఎక్స్- షోరూంలో వాహనాల ధరలు 1.7శాతం పెరిగింది." అని మారుతీ సుజుకీ పేర్కొంది.
గతేడాదిలో ఏకంగా మూడు సార్లు కార్ల ధరలను పెంచింది మారుతీ. జనవరిలో 1.4, ఏప్రిల్లో 1.6, సెప్టెంబర్లో 1.9శాతం చొప్పున పెంచింది. ఈ మేరకు మొత్తం కలిపి.. గతేడాదిలో వాహనాల ధరలు 4.9శాతం పెంచింది మారుతీ.
ముడి పదార్థాల వ్యయాలు పెరిగిన కారణంగా వాహనాల ధరలను పెంచినట్లు గత నెలలో పేర్కొంది.
మారుతీ సుజుకీ ఇండియా(ఎమ్ఎస్ఐ) ఆల్టో నుంచి ఎస్- క్రాస్ రేంజ్ కార్లను విక్రయిస్తుంది. వీటి ధరలు రూ.3.15లక్షల నుంచి రూ.12.56లక్షల వరకు ఉంటుంది.
ఇదీ చూడండి: Corona Insurance: కరోనా వచ్చిందా.. కొత్తపాలసీ ఆలస్యమే!