బీఎస్ 6 ప్రమాణాలతో కూడిన ఎస్-సీఎన్జీ వేరియంట్ సెలేరియో కార్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ). ఈ మోడల్ ధర (దిల్లీ ఎక్స్ షోరూం) రూ.5.36 లక్షలు, రూ.5.61 లక్షలు, రూ.5.68 లక్షలుగా నిర్ణయించింది.
ఈ మోడల్ 30.47/కేజీ మైలేజ్ ఇస్తుందని మారుతీ సుజుకీ వెల్లడించింది.
సెలేరియో మోడల్‌ను ఇప్పటికే 5 లక్షల మంది కొనుగోలు చేయగా.. సీఎన్జీ బీఎస్ 6 వేరియంట్‌ను అదే విధంగా ఆదరిస్తారని మారుతీ భావిస్తోంది.
ట్రయంఫ్ బానవిల్ బ్లాక్ ఎడిషన్..
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మోటార్ సైకిళ్ల సంస్థ ట్రయంఫ్ భారత్‌లో బానవిల్ బ్లాక్ ఎడిషన్ టీ 100, టీ 120 మోడళ్లను విడుదల చేసింది.
900 సీసీ ఇంజిన్ ఇంజిన్ బానవిల్ టీ 100 ధర రూ.8.87 లక్షలుగా, 1200 సీసీ ఇంజిన్ బానవిల్ టీ 120 బైక్ ధర రూ. 9.97 లక్షలుగా నిర్ణయించింది ట్రయంఫ్. ఈ బైల్లతో పాటు బైక్‌రైడింగ్ ప్రియులకోసం150 రకాలకుపైగా యాక్సెసిరీస్లను అందుబాటులో ఉంచినట్లు ట్రయంఫ్ ఇండియా తెలిపింది.
ఇదీ చూడండి:ఆదాయం లేకుంటే సగం జనాభా జీవనం నెల రోజులే!