ETV Bharat / business

ఆ కారణాలతో ఈ వారమూ ఒడుదొడుకులే..!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారమూ ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశముందటున్నారు నిపుణులు. కరోనా భయాలకు తోడు ఎస్​ బ్యాంక్ సంక్షోభం, వృద్ధి ఆందోళనల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించే వీలుందని విశ్లేషిస్తున్నారు.

STOCKS MARKET EXPECTATIONS
స్టాక్ మార్కెట్​ అంచనాలు
author img

By

Published : Mar 8, 2020, 5:14 PM IST

స్టాక్ మార్కెట్లను నష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. గడిచిన రెండు వారాలూ సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. కరోనా వైరస్ భయాలకు తోడు ఎస్​ బ్యాంక్ సంక్షోభం మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. ఈ భయాలు ఇంకా తగ్గని కారణంగా ఈ వారమూ మార్కెట్లు ఒత్తిడిలో కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సెలవు..

ఈ వారంలో ఎక్స్చేంజీలు నాలుగు రోజులే పని చేయనున్న నేపథ్యంలో మదుపరులు మరింత అప్రమత్తంగా వ్యవహరించే వీలుందని చెబుతున్నారు. హోలీ సందర్భంగా మంగళవారం (మార్చి 10) మార్కెట్లకు సెలవు.

ద్రవ్యోల్బణం లెక్కలు..

మరో వైపు రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు గురువారం విడుదలకానున్నాయి. టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు శుక్రవారం విడుదల చేయనుంది కేంద్ర గణాంక కార్యాలయం. వీటన్నింటిపైనా మదుపరులు దృష్టి సారించే అవకాశముందని విశ్లేషిస్తున్నారు మార్కెట్​ నిపుణులు.

"భారత ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండు వారాలు భారీ నష్టాలను నమోదు చేశాయి. చైనా వెలుపల కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండటం, ఎస్​ బ్యాంక్​ సంక్షోభం వంటివి మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఆ భయాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సూచీలపై ఒత్తిడి కొనసాగే అవకాశముంది. విదేశీ సంస్థాగత పెట్టుబడుల్లో హెచ్చుతగ్గులూ సూచీలపై ప్రభావం చూపొచ్చు."- సిద్ధార్థ్ కింకా, రిటైల్​ రీసర్చ్​ అధిపతి, మోతీలాల్​ ఓస్వాల్​ ఫినాన్సియల్​ సర్వీసెస్.​

కరోనా భయాలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించొచ్చని.. ఆ ప్రభావం దేశీయ సూచీలపైన ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. దేశ ఆర్థిక వృద్ధిపై వరుసగా ప్రతికూల అంచనాలు వెలువడుతుండటం విదేశీ మదుపరుల సెంటిమెంట్​ను బలహీన పరుస్తున్నట్లు చెబుతున్నారు.

"మందగమనం భయాలు తగ్గి త్వరలో అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడితే..మన సూచీలు పుంజుకుంటాయి."- దీపక్​ ఝాన్సీ, రిటైల్​ రీసర్చ్​ అధినేత, హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​

ఇదీ చూడండి:మహిళలూ... పొదుపులో ఈ సూత్రాలు పాటిస్తున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.