ETV Bharat / business

మాంద్యం భయాలతో పతనం- సెన్సెక్స్​ 1068 మైనస్​

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1068 పాయింట్లు, నిఫ్టీ 313 పాయింట్లు మేర కుదేలయ్యాయి. మోదీ సర్కార్ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ మదుపరులను తీవ్రంగా నిరాశపరచడం, ఆర్థిక మాంద్యం పొంచివుందన్న హెచ్చరికలే ఇందుకు కారణం.

Markets heavily hit by fears of recession
మాంద్యం భయాలతో భారీగా నష్టపోయిన మార్కెట్లు
author img

By

Published : May 18, 2020, 3:40 PM IST

ఆర్థిక మాంద్యం భయాలకు తోడు ఉద్దీపన ప్యాకేజీ మదుపరుల్లో విశ్వాసాన్ని కల్పించడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో స్టాక్​మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1068 పాయింట్లు కోల్పోయి 30 వేల 28 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 313 పాయింట్లు నష్టపోయి 8 వేల 823 వద్ద స్థిరపడింది.

భారత్​ ఇంతకు ముందు కనీవినీ ఎరుగని ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొనే అవకాశముందని గోల్డ్​మన్ శాక్స్ గ్రూప్​ అంచనా వేయడమూ మదుపరులను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. మరోవైపు రక్షణ రంగానికి చెందిన షేర్లు బాగా లాభపడ్డాయి. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియమాలను సవరిస్తూ.. 74 శాతానికి పెంచిన నేపథ్యంలో మదుపరులు ఈ సంస్థలవైపు మొగ్గుచూపారు.

లాభనష్టాల్లో..

టీసీఎస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, సిప్లా, భారతీ ఇన్​ఫ్రాటెల్, హెచ్​సీఎల్ టెక్ రాణించాయి.

ఇండస్​ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్​డీఎఫ్​సీ ట్విన్స్, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, టైటాన్, రిలయన్స్ నష్టపోయాయి.

ఇదీ చూడండి: మార్కెట్లు నష్టాల్లో ఉన్నా రక్షణ రంగ షేర్ల దూకుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.