ETV Bharat / business

వరుస లాభాలకు బ్రేక్- సెన్సెక్స్ 580 డౌన్

author img

By

Published : Nov 19, 2020, 3:49 PM IST

Updated : Nov 19, 2020, 4:29 PM IST

వరుస లాభాలతో రికార్డు గరిష్ఠాలను తాకిన స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం డీలా పడ్డాయి. సెన్సెక్స్ 580 పాయింట్లు తగ్గి 43,700 దిగువకు చేరింది. నిఫ్టీ 166 పాయింట్ల నష్టంతో 12,800 మార్క్​ను కోల్పోయింది.

Share market updates
స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణాలు

స్టాక్ మార్కెట్ల రికార్డు స్థాయి లాభాల జోరుకు గురువారం అడ్డుకట్ట పడింది. బీఎస్​ఈ-సెన్సెక్స్ 580 పాయింట్లు కోల్పోయి 43,600 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 166 పాయింట్ల నష్టంతో 12,772 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ పలు నగరాల్లో లాక్​డౌన్ దిశగా అడుగులు పడడం మదుపరుల సెంటిమెంట్​ను దెబ్బతీసింది. ఫలితంగా వారంతా ఇటీవల నమోదైన భారీ లాభాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు.

బ్యాంకింగ్, టెలికాం, ఆటో షేర్లు భారీగా కుదేలయ్యాయి. విద్యుత్ రంగ షేర్లు మాత్రం లాభాలను గడించాయి.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 44,230 పాయింట్ల అత్యధిక స్థాయి(జీవనకాల గరిష్ఠం), 43,518 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 12,963 పాయింట్ల గరిష్ఠ స్థాయి(జీవనకాల రికార్డు స్థాయి), 12,745 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

పవర్​గ్రిడ్, ఐటీసీ, ఎన్​టీపీసీ, టాటా స్టీల్, టైటాన్, బజాజ్ ఫిన్​సర్వ్ షేర్లు లాభాలను నమోదు చేశాయి.

ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, టోక్యో సూచీలు లాభాలు గడించాయి. సియోల్, హాంకాంగ్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి, ముడి చమురు..

కరెన్సీ మార్కెట్​లో రూపాయి 8 పైసలు తగ్గింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 74.27 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.65 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 44.05 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:'వృద్ధి రేటు క్షీణత 10.6 శాతమే!'

Last Updated : Nov 19, 2020, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.