స్టాక్‌మార్కెట్ల జోరుకు బ్రేక్ పడింది. మూడు వరుస సెషన్లలో లాభాల తర్వాత దేశీయ సూచీలు గురువారం కుప్పకూలాయి. బొంబాయి స్టాక్ ఎక్సేంజి సూచీ సెన్సెక్స్ 599 పాయింట్లు పతనమైంది. చివరకు 50 వేల 846 వద్ద స్థిరపడింది. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 800 పాయింట్లకుపైగా నష్టంతో.. 50 వేల 540 వద్ద కనిష్ఠానికి చేరింది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 165 పాయింట్లు పడిపోయి 15 వేల 81 వద్ద సెషన్‌ను ముగించింది.
లాభనష్టాల్లో..
అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్, అదానీ పోర్ట్స్, గ్రేసిమ్, డా. రెడ్డీస్ ల్యాబ్స్ లాభాలను గడించాయి.
జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, హిందాల్కో డీలపడ్డాయి.
ఇదీ చూడండి: 'కారు విలాసం కాదు.. అవసరం'