లాభాల జోరు..
స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగింది. ప్రస్తుతం 49 వేల 798 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నడుమ సూచీలు దూసుకెళ్తున్నాయి.
నిఫ్టీ 122 పాయింట్ల లాభంతో 14 వేల 644 వద్ద ట్రేడవుతోంది.
టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, విప్రో, టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం లాభాల్లో ఉన్నాయి.
ఎన్టీపీసీ, శ్రీ సిమెంట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గెయిల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డీలా పడ్డాయి.