స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 200 పాయింట్లకుపైగా లాభంతో.. 48 వేల 590 ఎగువన ట్రేడవుతోంది.
నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి.. 14 వేల 550 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లో..
హిందాల్కో, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, రిలయన్స్, పవర్ గ్రిడ్ లాభాల్లో కొనసాగుతున్నాయి.
హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా నష్టాల్లో ఉన్నాయి.
కదలికల్లో అప్రమత్తత..
అమెరికా మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మాత్రం నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. కీలక రంగాల నుంచి మద్దతు లభిస్తుండడం సూచీల దన్నుగా నిలుస్తోంది. అయితే, సూచీల కదలికల్లో కొవిడ్ అప్రమత్తత స్పష్టమవుతోంది. కరోనా కేసుల విజృంభణ, ఆసియా మార్కెట్ల డీలా నేపథ్యంలో లాభాలు ఎంత మేర కొనసాగుతాయన్నది చూడాల్సి ఉంది.