శుక్రవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఎఫ్‌పీఐలపై పన్ను సర్‌ఛార్జీ విధింపు ప్రతిపాదనను వెనక్కు తీసుకోవచ్చన్న వార్తలు, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను సమీక్షించవచ్చన్న అంచనాలే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 243 పాయింట్లు వృద్ధిచెంది 37 వేల 570 వద్ద కొనసాగుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 76 పాయింట్లు లాభాపడి 11 వేల 109 వద్ద ట్రేడవుతోంది.
లాభాల్లో
పవర్‌గ్రిడ్ కార్ప్, ఆల్ట్రాటెక్ సిమెంట్, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండస్బుల్స్ హెచ్ఎస్జీ, హెచ్డీఎఫ్సీ, లార్సెన్, హీరోమోటో కార్ప్ రాణిస్తున్నాయి.
నష్టాల్లో
టాటా మోటార్స్, టెక్‌మహీంద్ర, భారతీ ఎయిర్టెల్, హిందాల్కో, ఎమ్ అండ్ ఎమ్, సన్‌ఫార్మా, టీసీఎస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఇదీ చూడండి: భారత మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, 10+