ETV Bharat / business

'మాల్యా, నీరవ్​, చోక్సీలు చట్టాన్ని ఎదుర్కోక తప్పదు' - మెహుల్​ చోక్సీ

విజయ్​ మాల్యా, నీరవ్​ మోదీ, మెహుల్​ చోక్సీలు చట్టాన్ని ఎదుర్కొనేందుకు భారత్​కు తిరిగివస్తారని తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. బీమా చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Mallya, Nirav Modi
'మాల్యా, నీరవ్​, చోక్సీలు చట్టాన్ని ఎదుర్కోక తప్పదు'
author img

By

Published : Mar 18, 2021, 7:45 PM IST

బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్​ మాల్యా, నీరవ్​ మోదీ, మెహుల్​ చోక్సీలు భారత్​కు తిరిగి వస్తారని, చట్టాన్ని ఎదుర్కోక తప్పదన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.

బ్రిటన్​లో తలదాచుకుంటున్న మాల్యా, నీరవ్​లను రప్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు తెలిపారు నిర్మల.

చోక్సీ అర్జెంటీనాలో ఉంటున్నట్లు భావిస్తున్నారు.

రాజ్యసభలో బీమా చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ విషయం వెల్లడించారు ఆర్థిక మంత్రి.

భారత్​లోని బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగ్గొట్టి యూకేకు పారిపోయారు మాల్యా. 2016, మార్చి నుంచి అక్కడే ఉంటున్నారు. అలాగే.. పంజాబ్​ నేషనల్​ బ్యాంకుకు రూ.14,500 కోట్లు ఎగ్గొట్టి నీరవ్​ మోదీ, మెహుల్​ చోక్సీలు దేశం దాటారు.

ఇదీ చూడండి: రిలయన్స్​-ఫ్యూచర్​ ఒప్పందానికి దిల్లీ హైకోర్టు బ్రేకులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.