ETV Bharat / business

షాపింగ్స్​ మాల్స్ తెరిచినా కొనేవాళ్లు కరవు! - రిటైల్ రంగంపై కరోనా ప్రభావం

లాక్​డౌన్​ సడలింపుతో.. దాదాపు 70 రోజుల తర్వాత ఇటీవలే చాలా ప్రాంతాల్లో షాపింగ్​మాల్​లు, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకున్నాయి. ప్రస్తుతం ఆ వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయి? షాపింగ్​పై వినియోగదారుల సెంటిమెంట్ ఎలా ఉంది?

malls degrowth in June
షాపింగ్​మాల్స్​పై కరోనా పిడుగు
author img

By

Published : Jun 21, 2020, 5:32 PM IST

గత ఏడాది జూన్​తో పోలిస్తే.. 2020 ఆరో నెల తొలి అర్థభాగంలో షాపింగ్​ మాల్స్​ 77 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. వీధి వ్యాపారాల వృద్ధి 61 శాతం పడిపోయింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ నుంచి ఇటీవల సడలింపులు ఇచ్చినా.. వినియోగదారుల్లో ఇంకా భయాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ఓ నివేదిక వెల్లడించింది.

భారత రిటైలర్ల సంఘం (ఆర్​ఏఐ) ఈ సర్వే చేసింది. ప్రతికూల వృద్ధి నేపథ్యంలో.. లాక్​డౌన్ సడలింపులు ఇచ్చినా రిటైల్ వ్యాపారాలకు పెద్దగా ఉపయోగపడలేదని నివేదిక అభిప్రాయపడింది. ముఖ్యంగా వినియోగదారుల్లో షాపింగ్​పై లాక్​డౌన్​కు ముందు ఉన్న సెంటిమెంట్ ఇప్పుడు లేదని తెలిపింది. రానున్న రోజుల్లో ఈ సెంటిమెంట్ మెరుగయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది.

సర్వేలోని ముఖ్యాంశాలు..

  • ఆదాయం లేకపోవడం సహా ఇతర కారణాలతో ప్రతి ఐదుగురిలో నలుగురు వినియోగదారులు షాపింగ్​​ ఖర్చులను తగ్గించుకుంటున్నారు.
  • కేటగిరీల వారీగా చూస్తే.. రెస్టారెంట్లు (70 శాతం), దుస్తుల దుకాణాలు (69 శాతం), యాక్సెసిరీస్ (65 శాతం ) క్షీణతను నమోదు చేశాయి.
  • దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఇంకా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. దీనివల్ల వ్యాపారాలు దెబ్బతిని .. ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడొచ్చు.
  • అన్ని రకాల వ్యాపారాలు వీలైనంత త్వరగా తెరుచుకోవాలి.. అప్పడే దేశం రికవరీ దిశగా ప్రయాణం ప్రారంభిస్తుంది.

ఇదీ చూడండి:గడువు ముగుస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.