ETV Bharat / business

జనవరి నుంచి వాహన ధరల పెంపు: ఎం&ఎం

author img

By

Published : Dec 15, 2020, 9:03 PM IST

ప్యాసింజర్​, వాణిజ్య శ్రేణిలోని అన్ని వాహనాలపై ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ. ఏ వాహనంపై ఎంత మేరకు ధరలు పెంచుతున్నారో ఇంకా వెల్లడించలేదు.

Mahindra to hike prices of passenger, commercial vehicles from January
జనవరి నుంచి వాహన ధరల పెంపు: ఎం&ఎం

మహీంద్రా అండ్‌ మహీంద్రా వాహనాల ధరలు పెరగనున్నాయి. ప్యాసింజర్‌, వాణిజ్య శ్రేణిలోని అన్ని వాహనాలపై జనవరి నుంచి ధరలు పెంచుతున్నామని ఆ సంస్థ ప్రకటించింది. పెరిగిన ముడి వనరుల ధరల భారాన్ని కొంతైనా తగ్గించుకొనేందుకే ఇలా చేస్తున్నామని పేర్కొంది. అయితే ఏ వాహనంపై ఎంత మేరకు ధరలు పెంచుతున్నారో ఇంకా వెల్లడించలేదు. మహీంద్రా ఉత్పత్తి చేసే థార్‌, స్కార్పియో మోడళ్లకు విపరీతమైన గిరాకీ ఉన్న సంగతి తెలిసిందే.

ముడి వనరుల ధరలు పెరగడంతో వాహన తయారీ సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ఫలితంగా వాహన ధరలు పెంచక తప్పడం లేదని చెబుతున్నాయి. జనవరి 1 నుంచి తమ కార్లపై 3 శాతం వరకు ధరలు పెంచుతున్నామని గతవారం ఫోర్డ్‌ ఇండియా ప్రకటించింది. అంతకుముందు దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా జవనరి నుంచి ధరలు పెంచుతున్నామని స్పష్టం చేసింది. మోడళ్లను బట్టి ధరల పెరుగుదల ఉంటుందని తెలిపింది.

ఇదీ చూడండి: 'రజనీ పార్టీ పేరు, గుర్తుపై త్వరలో క్లారిటీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.