దేశీయ కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి సరికొత్త బొలేరో నియో సబ్‌కాంపాక్ట్ కారును విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న టీయూవీ 300 మోడల్‌ను ఈ కారు భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బొలేరోకు బలమైన మార్కెట్ ఉంది. దాదాపు 13లక్షల వాహానాలను విక్రయించారు. దీనిలో ఇప్పుడు సబ్‌కాంప్టాక్ట్ మోడల్‌ను మహీంద్రా తీసుకొచ్చింది. ఈ కారులో టీయూవీ 300లో వలే విశాలమైన క్యాబిన్,బొలేరో స్టైల్ కలగలిపి ఉన్నాయి. ఈ కారు ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.8.48 లక్షలుగా కంపెనీ పేర్కొంది.
"సరికొత్త తరం టెక్నాలజీలను కలగలిపి శక్తివంతమైన అత్యాధునిక ఎస్‌యూవీని తీసుకొచ్చాం. బలమైన ఎస్‌యూవీ అవసరమైనట్లు డిజైన్,పనితీరు, ఇంజిన్‌లో ఎన్నో మార్పులు చేశాం."
-విజయ్ నక్రా, మహీంద్రా ఆటోమోటీవ్ విభాగం ఎండీ
ఇటలీకి చెందిన పినిన్‌ఫర్నియా సంస్థ ఈ కారును డిజైన్ చేసింది. విశాలమైన ఇంటీరియర్, ఏబీసీ, ఈబీడీ, సీబీసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐఎస్ ఫిక్స్ ఛైల్డ్ సీట్‌ను కూడా ఇచ్చారు. స్కార్పియోలో వినియోగించే థర్డ్ జనరేషన్ ఛాసిస్‌ను అమర్చారు. ఈ కారుకు మల్టీటెర్రైన్ టెక్నాలజీ వాడారు.
ఈ కారులో 7సీట్లు ఉన్నాయి. టిల్టబుల్ స్టీరింగ్, డ్రైవర్ సీటు ఎత్తు సరిచేసుకొనే సౌకర్యం, 17.8 సెంటీమీటర్ల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, క్రూజ్‌కంట్రోల్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వాయిస్ మెసేజ్ సిస్టమ్, బ్లూసెన్స్ మొబైల్ యాప్, ఎకోమోడ్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్,ఈబీడీ, ఆటోమేటిక్ డోర్ లాక్, హైస్పీడ్ అలర్ట్, రిమోట్ లాక్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లను ఇచ్చింది. ఎంహాక్ 100 ఇంజిన్ అమర్చారు. 100 బీహెచ్‌పీ శక్తి, 260 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది.
ఇవీ చదవండి: