ETV Bharat / business

కొవిడ్‌ చికిత్సకు బ్యాంకుల రుణ సాయం

తమ ఖాతాదారులు కొవిడ్‌ బారిన పడి, డబ్బు అవసరమైనప్పుడు రుణాలు ఇచ్చేందుకు ఇప్పుడు పలు ప్రభుత్వ బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు దీనికి సంబంధించి ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.

Loan assistance for covid treatment
కరోనా చికిత్స బ్యాంకు రుణం
author img

By

Published : Jun 4, 2021, 7:23 AM IST

స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో కరోనా వస్తే ఇంటి వద్ద చికిత్స సరిపోతుంది. కానీ, ఏదైనా తేడా వచ్చినప్పుడు మాత్రం ఆసుపత్రిలో చేరడం తప్పనిసరి అవుతోంది. ఇలాంటప్పుడు చికిత్సకు రూ.లక్షల్లోనే ఖర్చవుతోన్న విషయం చూస్తూనే ఉన్నాం. ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ.. చికిత్స ఖర్చు అంతకు మించితే.. డబ్బు సమకూర్చుకోవడం కోసం అప్పులు తప్పడం లేదు. పైగా ఇంటి వద్ద కొన్నాళ్లపాటు ఔషధాలు, ఇతర ఖర్చులూ ఉంటాయి.

ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన తమ ఖాతాదారులకు రుణాలందించేందుకు పలు బ్యాంకులు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాయి. సాధారణ వ్యక్తిగత రుణాలు 12-15 శాతం వరకూ వడ్డీ ఉంటుంది. కానీ, ఈ ప్రత్యేక రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నట్లు బ్యాంకులు చెబుతున్నాయి. ఎస్‌బీఐ, యూబీఐలాంటి బ్యాంకులు 8.5శాతం వడ్డీకి కొవిడ్‌ వ్యక్తిగత రుణాలను అందిస్తున్నట్లు ప్రకటించింది.

బ్యాంకులు ఈ రుణాలను కనీసం రూ.25,000 నుంచి గరిష్ఠంగా రూ.5,00,000 వరకూ ఇస్తున్నాయి. రుణ వ్యవధి గరిష్ఠంగా ఐదేళ్ల వరకూ ఉంటోంది.

ఆయా బ్యాంకుల్లో వేతనం, పింఛను ఖాతా ఉన్న వారికే బ్యాంకులు ఈ రుణాలను మంజూరు చేస్తున్నాయి. లేదా గృహ, వాహన, ఇప్పటికే వ్యక్తిగత రుణం ఉన్న రుణగ్రహీతలకూ కొవిడ్‌ వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. కరెంటు ఖాతాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు.. ఆదాయపు పన్ను రిటర్నులు ఉంటే.. అప్పు ఇస్తామని అంటున్నాయి బ్యాంకులు.

తప్పనిరి పరిస్థితుల్లో..

కొవిడ్‌-19 చికిత్స తర్వాత చేతిలో డబ్బు లేనప్పుడు ఈ రుణం తీసుకుంటే కాస్త వెసులుబాటు దొరుకుతుంది. అయితే, అప్పు ఇస్తున్నారు కదా అని అవసరం లేకపోయినా రుణం తీసుకోవడం అంత మంచిది కాదు. దీర్ఘకాలంలో ఇది భారంగానే మారుతుంది. నెలనెలా ఈఎంఐ చెల్లించడమూ ఇబ్బందే. ఈ విషయాలన్నీ విశ్లేషించుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్య బీమా లేకపోతే తీసుకోవడం, ఇప్పటికే ఆరోగ్య బీమా ఉంటే.. దాన్ని సూపర్‌ టాపప్‌ చేయించుకోవడంలాంటి మార్గాలు మేలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: కరోనా చికిత్సకు ప్రభుత్వ బ్యాంకుల 'రుణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.