ETV Bharat / business

అమ్మకానికి 'ఎల్​ఐసీ'.. ఉద్యోగ సంఘాల ఆగ్రహం - ఎల్​ఐసీ పబ్లిక్ ఆఫల్ ఎప్పుడంటే

ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి మార్కెట్లోకి వచ్చినా.. అమ్ముడుపోకపోతే చివరికి ఆ వాటాలను ఎల్‌ఐసీ కొనుగోలు చేసి ఆదుకొంటుంది. ఒక రకంగా ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణకు ఎల్‌ఐసీ పెద్ద దిక్కులాంటిది. ఇప్పుడు ఆ పెద్దదిక్కులోని వాటాలనే ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ఈ నిర్ణయం మార్కెట్లకు.. పెట్టబడిదారులకు శుభవార్త అయినా.. ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఎల్‌ఐసీని ఎందుకు అమ్మకానికి పెట్టారు?

LIC union up in arms against IPO plan
'పెద్ద దిక్కు' వాటాల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధం-ఉద్యోగ సంఘాల ఆగ్రహం
author img

By

Published : Feb 1, 2020, 10:09 PM IST

Updated : Feb 28, 2020, 8:06 PM IST

జీవిత బీమా కార్పొరేషన్​(ఎల్​ఐసీ)​లో ప్రభుత్వ వాటాలను విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి వస్తే కొనుగోలు చేసి ఆదుకొనే ఎల్​ఐసీనే అమ్మకానికి రావడం వెనక అనేక కారణాలున్నాయి.

ఎల్‌ఐసీ (జీవిత బీమా కార్పొరేషన్‌) వద్ద భారీగా నిరర్థక ఆస్తులు, తక్కువ రేటింగ్‌ పెట్టుబడులు పోగుబడుతున్నాయి. ఇటువంటివి దాదాపు రూ.67,387 కోట్లకు చేరాయి. ఈ లెక్కలను ఆ సంస్థే ప్రకటించింది. 2014 తర్వాత ఈ సంస్థ పెట్టుబడులు కూడా భారీగా పెరిగిపోయాయి. నిధుల కొరత ఉన్న ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల్లో వాటాలు కొని ఆదుకొంది. సెప్టెంబర్‌ త్రైమాసికానికి ఎల్‌ఐసీ రూ.30వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. అంతుకు ఆరునెలల ముందుతో పోలిస్తే ఇది రూ.5,000 కోట్లు ఎక్కువ. మార్చి త్రైమాసికంలో ఇవి రూ.24,777 కోట్లుగా ఉన్నాయి. 2015 మార్చి నుంచి సెప్టెంబర్‌ 2019 వరకు 145శాతం పెరిగాయి. ఇవి ప్రమాద ఘంటికలు మొగించినట్లే లెక్క. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలహీనమైన పెట్టుబడులు(డౌన్‌గ్రేడింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్లు)రూ.23,126 కోట్లుగా ఉన్నాయి. ఇప్పటికే రిలయన్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, పీఎన్‌బీ హౌసింగ్‌, ఎస్సార్‌ పవర్‌, స్టెర్లింగ్‌ బయోటెక్‌, ఏబీజీ షిప్‌యార్డ్‌, డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ వంటి పెద్ద సంస్థలు ఉన్నాయి. దీనికి తోడు ఎల్‌ఐసీ సాల్వెన్సీ రేషియో కూడా సెప్టెంబర్‌ 2019 నాటికి 1.55 నిష్పత్తికి చేరింది. ఇది పరిశ్రమలో అతితక్కువ.

భారీగా పెరిగిన పెట్టుబడులు

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్‌ఐసీ పెట్టుబడులు భారీగా 76శాతం పెరిగాయి. మార్చి 2019 నాటికి ఎల్‌ఐసీ రూ.26,61,564 కోట్లు పెట్టుబడులుగా పెట్టింది. 2014లో ఈ మొత్తం కేవలం రూ.15,11,133 కోట్లుగా ఉంది. మోదీ సర్కారు చేపట్టిన పెట్టుబడి ఉపసంహరణల్లో చాలా వాటిని ఇదే ఆదుకొంది. బీహెచ్‌ఈఎల్‌లో 5.94శాతం వాటా.. కోల్‌ ఇండియాలో రూ.7,000 కోట్లు.. 2017 జనవరిలో జీఐసీ, న్యూఇండియా ఎష్యూరెన్స్‌ కార్పొరేషన్‌లో రూ.15,000 కోట్లు, 2018లో ఐడీబీఐలో రూ.13,000 కోట్లు పెట్టి వాటాలు కొనుగోలు చేసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ను కూడా కష్టాల నుంచి బయటపడేయమని ప్రభుత్వం కోరినా.. మోసపూరిత వ్యవహారాలు ఉండటంతో వెనుకడుగు వేసింది. ఏటా కనీసం రూ.55వేల కోట్ల వరకు మార్కెట్లలో ఎల్‌ఐసీ పెట్టుబడులు వస్తుంటాయి. ఎల్‌ఐసీకి రూ.4లక్షల కోట్లకు విలువైన డిబెంచర్లలో పెట్టుబడులు ఉన్నాయి. దీతోపాటు ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో రూ.3.7లక్షల కోట్ల వరకు మదుపు చేసింది.

దేశంలోనే భారీ కంపెనీగా అవతరణ..

ఎల్‌ఐసీ కనుక మార్కెట్లో లిస్ట్‌ అయితే దేశంలోనే భారీ కంపెనీగా అవతరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ కంపెనీ ఆస్తులు.. పెట్టుబడుల లెక్క చూస్తే తేలిగ్గా ఇప్పుడున్న అన్ని టాప్‌ కంపెనీలను దాటేస్తుంది. ఈ కంపెనీ మొత్తం పెట్టుబడులే రూ.31.11 లక్షల కోట్లు. ఇక 2018 సంవత్సర లాభం రూ.48,436 కోట్లు. ఈ కంపెనీ మార్కెట్లలో లిస్ట్‌ అయితే కనుక భారీగా విలువ పెరగడం ఖాయం. ఒక్క వాటాల పెట్టుబడులపైనే రూ.25వేల కోట్లకు పైగా లాభం వచ్చింది. ఇంత విలువైన సంస్థను ఎల్‌ఐసీ యాక్ట్‌ 1956 ప్రకారం రూ.5కోట్ల నిర్వహణ మూలధనంతో ప్రారంభించారు.

"భారీగా నిర్వహణ ఆస్తులు ఉన్న కంపెనీ ఎల్​ఐసీ... మూలధనం ప్రకారం భారత్​ అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించే అవకాశం ఉంది. ప్రభుత్వ సంస్థ కావడం వల్ల ప్రైవేటు కంపెనీలతో పోలిస్తే వాల్యుయేషన్ గ్యాప్(కంపెనీ వాస్తవ విలువకు, అమ్మకం విలువకు మధ్య తేడా) కనిపిస్తుంది. కేవలం 25-30 శాతం ఆస్తులు దాదాపు 8-10 లక్షల కోట్లు విలువ చేసే అవకాశం ఉంది."

-కాజల్ గాంధీ, ఐసీఐసీఐ డైరెక్ట్​ విశ్లేషకులు

ఎంత శాతం వాటాల విక్రయం..

ప్రభుత్వం ఎల్‌ఐసీలో ఎంత శాతం వాటాలను విక్రయిస్తుందనే విషయం కచ్చితంగా చెప్పలేదు. కానీ, 2019లో మాత్రం లిస్టెడ్‌ కంపెనీల్లో 35 శాతం ప్రజలకు వాటా ఉండాలనే నిబంధన విధించింది. ఇది వర్తిస్తే కనుక ఆమేరకు పెట్టుబడుల ఉపసంహరణ జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ కంపెనీ లిస్ట్‌ అయితే పెట్టుబుడుల విషయం బహిరంగా వెల్లడించాలి, దీంతోపాటు నిర్వహణ కూడా మరింత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ద్రవ్యలోటుకు మందు..

ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.5శాతం లక్ష్యంగా పెట్టుకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 3.8శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఈ సారి ఎయిర్‌ ఇండియా వంటి భారీ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమాలు కొలిక్కి రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అందుకే వచ్చే ఏడాది ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణను ఎంచుకొంది. దీనిలో వాటాలను విక్రయిస్తే భారీ మొత్తం ప్రభుత్వానికి లభిస్తుంది. దీనికి తోడు ఐడీబీఐ బ్యాంక్‌లో వాటాలు కూడా విక్రయిస్తామని పేర్కొంది. అప్పుడు ద్రవ్యలోటును అదుపు చేయవచ్చనేది ప్రభుత్వ వ్యూహం.

ఉద్యోగ సంఘాల ఆగ్రహం..

ఎల్‌ఐసీ విక్రయం జాతి ప్రయోజనాలకు భంగకరమని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. నేడు బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటన అనంతరం పలువురు స్పందించాయి. ప్రస్తుతం ఎల్‌ఐసీలో 1,11,979 మంది ఉద్యోగులు ఉన్నారు.

"ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు నిధులు సమకూర్చేందుకు ఎల్​ఐసీ చివరి గమ్యం వంటిది. ప్రభుత్వ నిర్ణయాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం."

-ఉద్యోగ సంఘాలు

"మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ సందర్భంగా ఎల్‌ఐసీతో చాలా సంస్థల్లో పెట్టుబడులు పెట్టించింది. అవన్నీ నష్టాల్లో ఉన్న సంస్థలు. మేము సంస్థను కొన్ని దశాబ్దాలుగా కాపాడుకుంటున్నాం. ప్రభుత్వ చర్యలను కొనసాగనివ్వం"

-శివ సుబ్రమణియన్‌, దక్షిణ జోన్‌ బీమా ఉద్యోగుల ఫెడరేషన్‌ జాయింట్‌ సెక్రటరీ.

Intro:Body:

Summary: In an exclusive interaction with ETV Bharat, Finance Minister Nirmala Sitharaman said that we will have to wait till a normal trading day like Monday to see the actual impact of the budget announcements.

New Delhi: In an exclusive interaction, Finance Minister Nirmala Sitharaman defended her budget announcements as positive.

When mentioned about not having an encouraging impact on the corporates, the Finance Minister said that: "We will have to wait till a normal trading day like Monday to see the actual impact of the budget announcements on the corporate sector."

Despite it being a Saturday and a non-trading day, both the stock exchanges were open today for trading; however, with a caveat that shares bought today could only be liquidated only on next working day i.e. Monday.

While the BSE Sensex lost 987 points and Nifty 300 points even as the FM Nirmala Sitaraman tweaked downwards the tax rates and restructured tax slabs into five.

The proposed tax regime is expected to leave more disposable income in the hands of consumers and hence boost consumption demand which is considered one of the main factors leading to the decline in the GDP growth.

Amongst other positives she also pegged the nominal growth for next fiscal at 10 per cent and was hopeful that the fiscal deficit would hold around 3.8 per cent for the current fiscal and 3.5 per cent for next fiscal.

To the question on that the corporates were expecting exemptions in STT, CCT and LTCG and were dismayed when it was not realised in the union budget she said that: "I have given a fillip to the FPI by increasing the investment limit from 9 per cent to 15 per cent in corporate bonds. This is a positive move and would further deepen the bond market."

Besides, the government was also looking at opening up other government securities for foreign investors.

Experts believe that increasing the Foreign portfolio investment (FPI) limit in corporate bonds is also likely to have a positive impact on the currency and is expected to underpin the Indian Rupee to around the level of 72.50 against the US Dollar.

Previously, BSE & NSE operated on Union Budget 2015-16 presentation day on February 28, 2015 by the former and late Finance Minister Arun Jaitley.

(- Sanjay Thapa, Delhi-based Senior Journalist.)

Conclusion:
Last Updated : Feb 28, 2020, 8:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.