ETV Bharat / business

ఎల్‌ఐసీ ఐపీఓ కోసం వెయిటింగా? రాయితీలో షేర్లు పొందండిలా! - lic ipo discount for policyholderslic ipo discount for policyholders

LIC IPO Shares discount: మరికొన్ని రోజుల్లోనే ఎల్​ఐసీ పబ్లిక్​ ఇష్యూకు రానుంది. రిటైల్‌ విభాగంలో తన పాలసీదారుల కోసం ప్రత్యేకంగా షేర్లను జారీ చేయబోతోంది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 10 శాతం షేర్లను కేటాయించనుంది. వీటికి షేరు ధరలో 5-10 శాతం రాయితీ సైతం ఇవ్వనున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. అయితే రాయితీలో షేర్లను దక్కించుకోవడం ఎలా?

LIC IPO
LIC IPO
author img

By

Published : Feb 11, 2022, 2:28 PM IST

LIC IPO Shares discount: జీవిత బీమా రంగ దిగ్గజం భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా) పబ్లిక్‌ ఇష్యూకి రాబోతోంది. రిటైల్‌ విభాగంలో తన పాలసీదారుల కోసం ప్రత్యేకంగా షేర్లను జారీ చేయబోతోంది. ఇందుకోసం ఇష్యూ పరిమాణంలో 10 శాతం షేర్లను కేటాయించనుంది. వీటికి షేరు ధరలో 5-10 శాతం రాయితీ సైతం ఇవ్వనున్నట్లు ఇప్పటికే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్‌ఐసీలో వాటాదారులుగా మారేందుకూ, రాయితీలో షేర్లను దక్కించుకునేందుకు ఏం చేయాలంటే..

మీరు ఎల్‌ఐసీ పాలసీదారులై, ఐపీఓలో పాల్గొనాలంటే.. మీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌)ను ఎల్‌ఐసీ పాలసీకి జత చేయాలి. అయితే, పాలసీకి ఆధార్‌నూ జత చేయడం ద్వారా.. ఎల్‌ఐసీ ఆన్‌లైన్‌ వెబ్‌సైటులో అనేక లావాదేవీలు చేసేందుకు సులువవుతుంది. సాధారణంగా జీవిత బీమా పాలసీ తీసుకునేందుకు పాన్‌ కార్డు తప్పనిసరి కాదు. కానీ, ఎల్‌ఐసీ తన పాలసీదారులకు షేర్లను కేటాయించేందుకు దీన్ని ప్రామాణికంగా తీసుకుంటోంది కాబట్టి, ఇప్పుడు అవసరం అవుతోంది.

పాన్‌ను నమోదు చేసేందుకు..

  • ముందుగా ఎల్‌ఐసీ అధీకృత వెబ్‌సైట్‌ https://licindia.in/ వెబ్‌సైటులోకి వెళ్లండి.
  • అక్కడ ఆన్‌లైన్‌ పాన్‌ రిజిస్ట్రేషన్‌ అనే లింకు కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేసి, అక్కడున్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి.
  • అడిగిన వివరాలను నమోదు చేయండి.
  • ఓటీపీ ద్వారా వాటిని అధీకృతం చేయండి.
  • ఆ తర్వాత మీ పాలసీ- పాన్‌ అనుసంధానం అయ్యిందా లేదా చూసుకునేందుకూ అక్కడే ఏర్పాటు ఉంది.
  • దీనికన్నా ముందు ఎల్‌ఐసీ వెబ్‌సైటులో మీ పాలసీ సంఖ్య ఆధారంగా ఆన్‌లైన్‌ యూజర్‌ ఖాతాను సృష్టించుకోండి. దీనివల్ల మీ పని ఇంకా సులభం అవుతుంది.

ఇక ఐపీఓలో షేర్ల కోసం దరఖాస్తు చేయాలంటే డీమ్యాట్‌ ఖాతా ఉండాల్సిందే. పాన్‌, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా వివరాలు.. వీటితో డీమ్యాట్‌ ఖాతా తీసుకోవడం ఎంతో సులభం. మీకు డీమ్యాట్‌ ఖాతా లేకపోతే.. చివరి నిమిషం వరకూ ఎదురుచూడకుండా మీకు నచ్చిన స్టాక్‌ బ్రోకర్‌ ద్వారా వీలైనంత వెంటనే దీన్ని తీసుకోండి.

రాబడి హామీతో..

పరిమిత కాలంపాటు ప్రీమియం చెల్లించడం ద్వారా దీర్ఘకాలంలో ఆదాయం పొందడం, జీవిత బీమా రక్షణ కల్పించే లక్ష్యంతో ఎక్సైడ్‌ లైఫ్‌ స్మార్ట్‌ ఇన్‌కం ప్లాన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ పాలసీకి 6/8/10/12 ఏళ్లపాటు ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత వరుసగా 12/16/20/24 ఏళ్లపాటు ఆదాయం పొందవచ్చు. ఈ పాలసీని ఎంచుకునేటప్పుడు రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఎన్‌హాన్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ను తీసుకుంటే.. పాలసీ రాబడి చెల్లింపు వ్యవధిలో ఏటా హామీతో కూడిన రాబడిని అందించడంతోపాటు, పాలసీ వ్యవధి తీరిన తర్వాత వర్తించే బోనస్‌లనూ చెల్లిస్తుంది. ఎన్‌హాన్స్‌డ్‌ ఇన్‌కం ఆప్షన్‌ ఎంచుకున్న వారికి.. పాలసీ వ్యవధి తీరిన తర్వాత వార్షిక రాబడి హామీతో కలిసి మొత్తాన్ని చెల్లిస్తారు. నాలుగు నుంచి 60 ఏళ్ల వయసున్న వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.

ఇదీ చూడండి: Home Loan: ఇంటిరుణం తొందరగా తీరాలంటే.. ఇలా చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.