ETV Bharat / business

సీఈఎస్ హైలైట్స్‌: రోలింగ్ డిస్‌ప్లే.. 3డీ స్కానర్‌ - ఇంటెల్ కొత్త ప్రాసెసర్

5జీ ఫోన్లు, ఫోల్టింగ్ ఫోన్లు ట్రెండ్​గా మారుతోన్న నేపథ్యంలో పలు కంపెనీలు అధునాతన ఆవిష్కరణలపై కన్నేశాయి. అమెరికాలోని లాస్​వేగాస్​ వేదికగా జరుగుతోన్న సీఈఎస్‌ 2021 కార్యక్రమంలో భవిష్యత్తులో ప్రజల ముందుకు రానున్న ఉత్పత్తులను ప్రదర్శించాయి.

CES2021
సీఈఎస్ హైలైట్స్‌: రోలింగ్ డిస్‌ప్లే..3డీ స్కానర్‌
author img

By

Published : Jan 12, 2021, 10:40 PM IST

కొద్ది రోజుల వరకు ఫోన్‌ కొనాలంటే బ్యాటరీ ఎంత, డిస్‌ప్లే క్వాలిటీ, ఎంత మెగాపిక్సెల్‌ కెమెరాలు ఉన్నాయన్నదే ముఖ్యం. తర్వాత 5జీ ఫోన్లు, ఆపైన ఫోల్డింగ్ ఫోన్ల సందడి మొదలైంది. ఇప్పుడు ఏకంగా రోలింగ్‌ ఫోన్లు రానున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. తాజాగా అమెరికాలోని లాస్‌వెగాస్‌ వేదికగా జరుగుతున్న సీఈఎస్‌ 2021లో భవిష్యత్తులో ప్రజల ముందుకు రానున్న ఉత్పత్తులను ప్రదర్శించాయి పలు కంపెనీలు. వాటిపై ఓ లుక్కేద్దామా మరి..

ఎల్‌ రోలింగ్‌ డిస్‌ప్లే..

కంపెనీ ఎక్స్‌ప్లోరర్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎల్‌జీ రోలబుల్ డిస్‌ప్లే ఫోన్‌ని ప్రదర్శించింది. ఎల్‌జీ రోలబుల్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ డిస్‌ప్లేని కావాలనుకున్నప్పుడు పెద్దదిగా మార్చుకోవచ్చు. పని పూర్తయ్యాక సాధారణ ఫోన్‌ స్క్రీన్‌లానే మారిపోతుంది. అయితే ఈ ఫోన్‌ని ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తారనే దానిపై పూర్తి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రయోగాల దశలోనే ఉందని ఎల్‌జీ తెలిపింది.

CES2021
ఎల్‌ రోలింగ్‌ డిస్‌ప్లే

టీసీఎల్‌ రోలింగ్ డిస్‌ప్లే

రోలింగ్ డిస్‌ప్లే ఫోన్ల కోసం టీసీఎల్‌ రోలింగ్ అమోలెడ్ డిస్‌ప్లేను తీసుకొస్తున్నట్లు తెలిపింది. సీఈఎస్‌ 2021లో ఈ డిస్‌ప్లేని ప్రదర్శించింది. దీన్ని పై నుంచి కిందికి జరుపుకోవచ్చు. 6.7-అంగుళాల నుంచి 7.8-అంగుళాల వరకు ఈ స్క్రీన్‌ మారుతుంది. దీనితో పాటు 17-అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రోలింగ్‌ డిస్‌ప్లేని కూడా టీసీఎల్‌ ప్రదర్శించింది. భవిష్యత్తులో టీవీ స్క్రీన్‌ అనుకూలంగా ఉండేలా ఇంక్‌జెట్‌ టెక్నాలజీతో దీన్ని రూపొందించినట్లు టీసీఎల్ తెలిపింది.

CES2021
టీసీఎల్‌ రోలింగ్ డిస్‌ప్లే

క్వాల్‌కోమ్‌ 3డీ సెన్సర్‌

క్వాల్‌కోమ్‌ సెకండ్‌ జనరేషన్‌ ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను ఆవిష్కరించింది. 3డీ సోనిక్‌ జెన్‌ 2 పేరుతో తీసుకొస్తున్న సెన్సర్‌తో ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్ స్కానింగ్ మరింత వేగంగా జరుగుతుంది. ఈ కొత్త సెన్సర్‌ శబ్ద తరంగాల సహాయంతో యూజర్‌ ఫింగర్ ‌ప్రింట్‌ని స్కాన్‌ చేస్తుందని క్వాల్‌కోమ్‌ తెలిపింది. గతంలో వచ్చిన 3డీ సోనిక్‌ సెన్సర్‌తో పోలిస్తే ఇది 50 శాతం వేగంగా, 77 శాతం పెద్దదిగా ఉంటుంది.

CES2021
క్వాల్‌కోమ్‌ 3డీ సెన్సర్‌

ఇంటెల్‌ కొత్త ప్రాసెసర్‌

అల్డర్‌ లేక్‌ పేరుతో ఇంటెల్ తర్వాతి తరం చిప్‌ సెట్‌లను తీసుకొచ్చింది. పాత వాటితో పోలిస్తే ఇవి ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయని ఇంటెల్‌ తెలిపింది. 2021 ద్వితీయార్థంలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 10ఎన్‌ఎమ్‌ సూపర్‌ఫిన్‌ ప్రాసెసర్‌లను ఉపయోగించారు. దీనితో పాటు గేమింగ్ ల్యాప్‌టాప్‌ల కోసం 11వ జనరేషన్‌ కోర్‌ హెచ్‌-సిరీస్‌ మొబైల్ ప్రాసెసర్‌లను ఇంటెల్ విడుదల చేసింది. ఇవే కాకుండా సోని డ్రోన్‌ కెమెరా, కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ ఐడ్రైవ్‌ పేరుతో కార్‌ డాష్‌బోర్డ్‌ డిస్‌ప్లేను ప్రదర్శించింది.

CES2021
ఇంటెల్ కొత్త ప్రాసెసర్​

ఇదీ చదవండి:పద్దులో వైద్య రంగానికి ప్రత్యేక నిధి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.