దేశీయంగా పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా టాబ్లెట్‌ల తయారీ చేపడతామని లెనోవో ప్రకటించింది. దీంతోపాటు కార్పొరేట్ సంస్థలు, ఆన్‌లైన్ విద్య కోసం విద్యార్థుల నుంచీ డిమాండ్ పెరగడంతో ల్యాప్‌టాప్ తయారీని 10 రెట్లు అధికం చేస్తున్నట్లు తెలిపింది
ఇందుకు సంబంధించిన వివరాలను లెనోవో ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ అగర్వాల్ వెల్లడించారు. గత అయిదేళ్లుగా చూస్తే దేశీయంగా వ్యక్తిగత వినియోగదారులు 40 లక్షల ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తున్నారని, ఈ ఏడాది మాత్రం డిమాండ్ 40 శాతం అధికమైందని, ఆన్‌లైన్ తరగతులే ఇందుకు కారణమని విశ్లేషించారు.