ETV Bharat / business

కేటీఎం నుంచి సరికొత్త 'అడ్వెంచర్​'.. ఫీచర్స్ అదుర్స్​! - కేటీఎం 250 అడ్వెంచర్​ 2022 ఎడిషన్

KTM 250 Adventure 2022: కేటీఎం బైక్స్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆదరగొట్టే ఇంజిన్​తో ఉండే ఈ బైక్​ హైవేలపై దూసుకెళ్తుంది. అందుకే కుర్రకారును ఆకర్షిస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సంస్థ నుంచి మరో బైక్​ వచ్చేసింది. మరి ఆ మోడల్​ ఏంటో.. దాని ఫీచర్లు ఏంటో చూసేద్దాం.

ktm
కేటీఎం
author img

By

Published : Jan 12, 2022, 3:59 PM IST

KTM 250 Adventure 2022: ఆకట్టుకునే డిజైన్లతో కుర్రకారులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రీమియం మోటార్​సైకిల్​ సంస్థ కేటీఎం మరో కొత్త మోడల్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది. కేటీఎం 250 అడ్వెంచర్​ బైక్​ 2022 ఎడిషన్​ను అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఈ బైక్​కు బుకింగ్స్​ కూడా బుధవారమే ప్రారంభమయ్యాయి. 248 సీసీ ఉన్న ఈ టూవీలర్​ ధర రూ. 2.35 లక్షలు (దిల్లీలో ఎక్స్​షోరూం ధర).

  • ఈ కేటీఎం 250 అడ్వెంచర్​.. రోజువారీ అవసరాలకు, లాంగ్​డ్రైవ్​లకు కూడా అనుగుణంగా ఉంటుందన్నారు సంస్థ ప్రతినిధులు.
  • కేటీఎం 390 అడ్వెంచర్​తో పోలిస్తే తేలిగ్గా ఉండే ఈ బైక్​లో 14.5 లీటర్ల సామర్థ్యం గల పెట్రోల్​ ట్యాంక్​ను ఏర్పాటు చేశారు.
  • బైకర్లను ఆకట్టుకునే విధంగా 248 సీసీ సామర్థ్యం గల ఈ బైక్​.. 30పీఎస్​ (హార్స్​పవర్​), 24 న్యూటన్​ మీటర్​ టార్క్​తో నడిచేలా తీర్చిదిద్దారు.
  • డ్యూయర్​ ఛానల్​ యాంటీ లాక్​ బ్రేకింగ్​ సిస్టమ్​తో పాటు 170 ఎంఎం యూఎస్​డీ ఫోర్క్​స్, 177 ఎంఎం రేర్​ సస్పెన్షన్​ను ఏర్పాటు చేశారు.
  • కేటీఎం 450 ర్యాలీ మోడల్​ ఆధారంగా ఈ బైక్​ను తయారుచేసినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
  • ఈ బైక్​ ప్రస్తుతం ఎలక్ట్రానిక్​ ఆరెంజ్​, రేసింగ్​ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంది.
    ktm launch
    రేసింగ్​ బ్లూలో కేటీఎం 250 అడ్వెంచర్​
    ktm launch
    ఎలక్ట్రానిక్​ ఆరెంజ్​లో కేటీఎం 250 అడ్వెంచర్​

2012లో భారత్​లోకి అడుగుపెట్టిన కేటీఎం ఇప్పటివరకు 3.1 లక్షల బైక్స్​ను విక్రయించింది.

ఇదీ చూడండి : 'ఉత్పాదకత వృద్ధికి సాంకేతికత'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.