ETV Bharat / business

కారు కొనకుండానే ఓనరు అవ్వండిలా... - మారుతి కార్లు

కారు కొనే స్తోమతలేదా? కారు ఓనరవ్వాలనే కోరిక అలాగే మిగిలిపోతోందా? మీలాంటి వారి కోసమే ఓ ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది మారుతి సుజుకీ. అదేంటో ఓసారి చూద్దాం.

maruti car price
మారుతి సబ్​స్క్రిప్షన్​
author img

By

Published : Jun 28, 2021, 5:48 PM IST

Updated : Jun 28, 2021, 6:03 PM IST

కారు కొనకుండానే యజమాని అవ్వొచ్చు. లక్షలు ఖర్చు చేయకుండానే దర్జాగా కారులో తిరగొచ్చు. వింతగా, నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది కదూ! కానీ.. మారుతి సుజుకీ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​తో ఇది సాధ్యమే.

ఈ పథకంతో మీరు ఎక్కడికైనా, ఎప్పుడైనా మీ 'సొంత కారు'లోనే వెళ్లొచ్చు. మారుతి వాహనాలైన వేగనార్​, విటారా బ్రెజ్జా, స్విఫ్ట్, ఇగ్నిస్​, బలీనో, సియాజ్​, ఎస్​-క్రాస్​, ఎక్స్​ఎల్​6 నచ్చినట్టు వినియోగించుకోవచ్చు.

నెలవారీ చెల్లింపులు..

మారుతి సబ్​స్క్రిప్షన్ ప్లాన్​ను గత ఏడాది జులైలో విడుదల చేశారు. ఈ ప్లాన్​ను సబ్​స్క్రైబ్​ చేసుకుంటే.. నెలవారీగా చెల్లింపులు చేయాలి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, కారు నిర్వహణ, ఇన్సూరెన్స్​తో పాటు ఇతర సేవలు కూడా నెలవారీ చెల్లింపుల్లోనే ఇమిడి ఉంటాయి. గడువు(24, 36, 48 నెలలు) ముగిసే సమయానికి సబ్​స్క్రైబ్ చేసుకున్న వాహనాన్నే అప్పటి మార్కెట్​ ధరకు పూర్తిగా కొనుకోవచ్చు. లేదంటే మరో కారును సబ్​స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్​స్ట్రిప్షన్​ను నిలిపివేసే ఆప్షన్​ కూడా ఉంటుంది.

మరో నాలుగు నగరాలకు..

ఇప్పుడు మరో నాలుగు నగరాలకు(జైపుర్​, ఇందోర్, మంగళూర్​, మైసూర్) తమ వాహన సబ్​స్క్రిప్షన్​ సేవలను విస్తరిస్తున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. ఈ సేవలను విస్తరించటం కోసం.. ఒరిక్స్​ ఆటో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ సర్విసెస్​ లిమిటెడ్, మైల్స్​ ఆటోమోటివ్​ టెక్నాలజీ ప్రైవేట్​ లిమిటెడ్​తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించింది.

"భారత మార్కెట్లో కారు సబ్​స్క్రిప్షన్​ అభివృద్ధి చెందుతున్న విధానం. కస్టమర్ల ఫీడ్​బ్యాక్​ ఆధారంగా మా సేవలను పెంచుతున్నాం. మరో నాలుగు నగరాలకు విస్తరించి మరింత మంది వినియోగదారులకు సేవలు అందించనున్నాం." అని సీనియర్​ ఎక్సిక్యూటివ్​ డైరెక్టర్​ శెషాంక్​ శ్రీవాస్తవ తెలిపారు.

ఇదీ చదవండి: కేంద్రం భారీ ఉద్దీపన ప్యాకేజీ- వారికి సులువుగా రుణాలు!

ఆ కార్ల ధరలు మరోసారి పెంపు

Last Updated : Jun 28, 2021, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.