ETV Bharat / business

కియా నుంచి కొత్త మోడల్.. 'కారెన్స్​' లుక్​ అదుర్స్​ - కియా కారెన్స్​ లాంచ్​

Kia Carens India: ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ కియా.. మరో కారును ప్రవేశపెట్టింది. ఆధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ 'కారెన్స్​' వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది.

kia carens
కియా కారెన్స్
author img

By

Published : Dec 16, 2021, 3:42 PM IST

Kia Carens India: అతితక్కువ కాలంలోనే భారత్​లో మంచి మార్కెట్​ సంపాదించిన దక్షిణకొరియా ఆటోమొబైల్​ సంస్థ కియా. ఇప్పటికే సెల్టోస్​, సొనెట్​, కార్నివల్​ను మార్కెట్లలోకి అందుబాటులోకి తెచ్చిన ఈ సంస్థ తాజాగా మరో కొత్త మోడల్​ను పరిచయం చేసింది. రీక్రియేషనల్​ వెహికిల్​ (ఆర్​వీ) మోడల్​గా సంస్థ పేర్కొంటున్న ఈ సరికొత్త 'కారెన్స్​'.. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో మార్కెట్​లో అందుబాటులోకి రానుంది.

kia carens
కియా 'కారెన్స్​' సైడ్​ లుక్​

బోల్డ్​ డిజైన్​, హైటెక్​ ఫీచర్లు, ఇండస్ట్రీ లీడింగ్​ సేఫ్టీ సిస్టమ్స్​తో రూపొందించిన ఈ కియా కారెన్స్​.. ఫ్యామిలీ వెహికిల్స్​లో ప్రత్యేక స్థానం నెలకొల్పుతుందని ధీమా వ్యక్తం చేశారు ఆ సంస్థ సీఈఓ హో సుంగ్​ సాంగ్​. ఈ త్రీ రో సీటర్​ కారులో.. ఎస్​యూవీ-ఎంపీవీ మోడళ్ల వల్ల ఉండే లాభాలు ఉంటాయన్నారు.

kia carens
కియా 'కారెన్స్​' ఫ్రంట్​ లుక్​

ఈ కారు పెట్రోల్​, డీజిల్​ రెండు వేరింయట్లలోనూ లభించనుంది. 7 స్పీడ్​ డ్యుయల్​ క్లచ్​ ట్రాన్స్​మిషన్, 6 స్పీడ్​ ఆటో ట్రాన్స్​మిషన్​లలో అందుబాటులోకి రానుంది.

kia carens
కియా 'కారెన్స్​'

సేఫ్టీ ఫీచర్లలో భాగంగా ఈ కారులో.. ఆరు ఎయిర్​బ్యాగ్స్​, ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ కంట్రోల్​ (ఈఎస్​సీ), వెహికిల్​ స్టెబిలిటీ మేనేజ్​మెంట్​ (వీఎస్​ఎం), హిల్​ అసిస్ట్​ కంట్రోల్​ (హెచ్​ఓసీ), డౌన్​హిల్​ బ్రేక్​ కంట్రోల్​ (డీబీసీ)తో ఆల్​వీల్​ డిస్క్​ బ్రేక్స్​ ఉంటాయి.

ఇంపీరియల్​ బ్లూ, మోస్​ బ్రౌన్, ఇంటెన్స్​ రెడ్​, అరోరా బ్లాక్​ పెర్ల్​, స్పార్కింగ్​ సిల్వర్​, గ్రావిటీ గ్రే, గ్లేసియర్​ వైట్​ పెర్ల్​ రంగుల్లో అందుబాటులోకి వస్తుంది.

ఇదీ చూడండి : ఆన్​లైన్ ట్రాన్సాక్షన్ ఛార్జీల రీఫండ్​- కేంద్రం కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.