ETV Bharat / business

మార్కెట్​లోకి 'మేడిన్ ఆంధ్రా' కియా కారు

మార్కెట్​లోకి కియా సెల్టోస్‌ కారు లాంఛనంగా విడుదలైంది. కియా పరిశ్రమలో కారును ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శంకరనారాయణ విడుదల చేశారు. వాణిజ్య కార్యకలాపాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

kia car
author img

By

Published : Aug 8, 2019, 4:01 PM IST

'మేడిన్ ఆంధ్రా' కియా కారు.... ఇవాళ్టి నుంచి రయ్‌మని దూసుకెళ్తుంది. సెల్టోస్ మోడల్ వాహనాన్ని కియా సంస్థ ఆవిష్కరించింది. ఏపీలో కియా మోటార్స్ కార్ల తయారీ పరిశ్రమ... వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది. అనంతపురం జిల్లా పెనుకొండలో ఏర్పాటైన పరిశ్రమ నుంచి... ఏటా 3 లక్షల కార్లు ఉత్పత్తి చేయనున్నారు. సంస్థలో తయారైన తొలి కారును ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించాలని భావించినా... ఆయన దిల్లీ పర్యటనలో ఉన్నందున ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్ ఆవిష్కరించారు. సెల్టోస్ కారు మార్కెట్‌లోకి ఇక చక్కెర్లు కొట్టనుంది.

మార్కెట్​లోకి 'మేడిన్ ఆంధ్రా' కియా కారు

ఇదీ చూడండి: సాహిత్యంలో వీళ్లు పిల్లలు కాదు పిడుగులు

Intro:ATP:- అనంతపురం జిల్లాకు కియా పరిశ్రమ రావడానికి ముఖ్య కారణం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, తెదేపా జిల్లా అధ్యక్షుడు పార్థసారథి అన్నారు. అనంతపురంలోని తెదేపా కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. కియా పరిశ్రమ అనంతపురం జిల్లాకు ఒక వరం అని గుర్తు చేశారు. ఆనాడు చంద్రబాబు కృషితోనే జిల్లాకు పరిశ్రమ వచ్చిందని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కియా కార్లు విడుదల విడుదల చేయడం చరిత్రలో నిలిచిపోయే విషయమన్నారు. అత్యంత కరువు ప్రాంతమైన జిల్లాకు వలసలు నివారించడానికి కియా పరిశ్రమ ఎంతగానో తోడ్పడిందన్నారు. అయితే ఒకప్పుడు అడ్డు చెప్పిన వైకాపా నాయకులు నేడు అంతా చేసినట్లు ఆర్బాటాలు చేయడం హాస్యాస్పదంగా వుందన్నారు.

Body:కియా పరిశ్రమ రావడానికి మూడు రాష్ట్రాల్లో పోటీ పడగా అందులో ఆంధ్రప్రదేశ్ ను ఎంపిక చేశారన్నారు. కియా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడి జిల్లాకు వచ్చేలా ఎంతగానో కృషి చేశారన్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి కియా పరిశ్రమ రావడానికి కృషి చేశారని వైకాపా నాయకులు చెప్పడం ఎంతో మంచి అబద్ధం గా ఉందని దీనిని ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పారు. ఏది ఏమైనా కియా ప్రతినిధులకు తెలుగుదేశం తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నాము అన్నారు. కియా ప్రతినిధులు స్థానికంగా ఉంటున్న వారికి 90 శాతం ఉద్యోగాలు కల్పించాలని వారు కోరారు.

బైట్స్ ..1..కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి ఆంధ్ర ప్రదేశ్ 2.....బి.కె పార్థసారథి, తెదేపా అనంతపురం జిల్లా అధ్యక్షుడు.

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.