కరోనా రెండో దశ ప్రభావం ఉద్యోగాలపై కూడా తీవ్రంగా పడింది. వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించడం వల్ల ఉద్యోగ నియామకాలు ఏప్రిల్‌లో (మార్చితో పోలిస్తే) 3 శాతం తగ్గినట్లు మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఉద్యోగ నియామకాలు 4 శాతం తగ్గినట్లు పేర్కొంది.
ఉద్యోగ నియామకాలు తగ్గినప్పటికీ.. కొన్ని పరిశ్రమలు, పలు నగరాల్లో మాత్రం బలమైన వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది.
నివేదికలోని మరిన్ని వివరాలు..
- 2020 ఏప్రిల్‌తో పోలిస్తే గతనెల.. ప్రకటనలు, మార్కెట్ రీసెర్చ్, పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) వంటి ఉద్యోగాలు హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో 50 శాతానికిపైగా పెరిగాయి.
- కోల్‌కతాలో గత నెల బ్యాంకింగ్, బీమా వంటి రంగాల్లో ఉద్యోగ నియామకాలు 26 శాతం పుంజుకున్నాయి.
- ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా నియామకాలు తగ్గినా.. బెంగళూరు (28 శాతం), హైదరాబాద్ (23 శాతం), చెన్నై (16 శాతం) వంటి నగరాల్లో నియామకాలు భారీగా పెరిగాయి.
- ఇంజినీరింగ్, సిమెంట్, నిర్మాణ, ఉక్కు, స్టీల్, రిటైల్ ఎంఫ్ఎంసీజీ, ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగాల్లో నియామకాలు గణనీయంగా తగ్గాయి.
- మీడియా, వినోదం వంటి రంగాల్లో మాత్రం ఉద్యోగాలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి.
ఇదీ చదవండి: ఆర్థిక రికవరీకి సవాళ్లు- ప్యాకేజీనే పరిష్కారం!