ETV Bharat / business

జియో కొత్త స్మార్ట్​ఫోన్​ ధర ఇలా.. ఈఎంఐ ఆప్షన్​ కూడా...

author img

By

Published : Oct 29, 2021, 5:47 PM IST

Updated : Oct 30, 2021, 12:06 PM IST

వినియోగదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న జియోఫోన్ నెక్ట్స్​ ​​ (JioPhone Next Price) ధరను ప్రకటించింది జియో సంస్థ. ఈ ఫోన్​ ధర రూ.6,499గా నిర్ణయించింది. ఈ ఏడాది దీపావళి నుంచి మార్కెట్​లోకి రానున్నట్లు పేర్కొంది.

Jiophone Next
జియోఫోన్ నెక్స్ట్

జియోఫోన్ నెక్ట్స్​ (JioPhone Next Price) ధరను ప్రకటించింది రిలయన్స్ సంస్థ. ఈ ఫోన్​ ధరను రూ. 6,499గా నిర్ణయించింది. ఈ ఏడాది దీపావళి నుంచి జియోఫోన్ నెక్స్ట్​​ మార్కెట్​లోకి విడుదల కానున్నట్లు తెలిపింది. వినియోగదారులు ముందుగా రూ.1,999 చెల్లించి, ఫోన్​ తీసుకుని.. మిగిలిన మొత్తాన్ని ఈఎంఐలుగా కట్టవచ్చని వెల్లడించింది. నాలుగు రకాల ఆఫ్షన్స్​తో ఈఎంఐ సదుపాయం కల్పించనుంది.

ఇప్పటికే జియోఫోన్​ నెక్ట్స్​​కు సంబంధించి అప్​డేట్స్​ను(JioPhone Next latest news) వీడియో రూపంలో ​విడుదల చేసింది జియో.

జియోఫోన్ నెక్ట్స్ హైలెట్స్..

  • జియోఫోన్​ నెక్ట్స్​ ​(JioPhone Next news) కోసం గూగుల్​, జియో సంయుక్తంగా సరికొత్త ప్రగతి ఆపరేటింగ్​ సిస్టమ్​ను(ఓఎస్) రూపొందించాయి.
  • క్వాల్​క్రమ్ స్నాప్‌డ్రాగన్ 215 క్యూఎమ్‌215 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు.
  • 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
  • 3500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
  • 13 ఎంపీ బ్యాక్​ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • 2 జీబీ ర్యామ్‌, 32జీబీ ఇంటర్నల్ మెమొరీ 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్
  • ధర.. రూ. 6,499

జియోఫోన్​ నెక్ట్స్​ ​(JioPhone Next news) కోసం గూగుల్​, జియో సంయుక్తంగా సరికొత్త ప్రగతి ఆపరేటింగ్​ సిస్టమ్​ను(ఓఎస్​) రూపొందించాయి. తక్కువ ధరకు గొప్ప అనుభూతిని అందిస్తూనే.. అందరినీ 'ప్రగతి'లోకి తీసుకురావాలనే లక్ష్యంతో జియో, గూగుల్‌లోని అత్యుత్తమ టెకీలు దీనిని అభివృద్ధి చేశారని జియో ప్రతినిధులు వెల్లడించారు.

ఈ ఓఎస్​ను కేవలం భారత్​ కోసమే ​అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సరికొత్త ఓఎస్​తో జియోఫోన్​ నెక్స్ట్.. ప్రత్యేకతలు ఇవే...

Last Updated : Oct 30, 2021, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.